మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు: సీఐ దీపక్
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) దీపక్ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండల పరిధిలోని ప్రధాన కూడళ్లు, రహదారులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు (డ్రంక్ అండ్ డ్రైవ్) నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ దీపక్ మాట్లాడుతూ..మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకే ఈ తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
తాగి వాహనం నడిపితే భారీ జరిమానాతో పాటు కోర్టు ద్వారా జైలు శిక్ష పడే అవకాశం ఉందని, అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. వాహనదారులు ప్రయాణాల్లో తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని సూచించారు. రోడ్లపై శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రమాదాల అడ్డుకట్టకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సీఐ దీపక్, స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
