ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
చిత్రం న్యూస్, బేల: మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను శుక్రవారం ఘనంగా సన్మానించారు. బేల మండల విద్యాధికారి మహాలక్ష్మి ఆధ్వర్యంలో బేల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపికైన ఉపాధ్యాయులను శాలువా, ప్రశంసా పత్రంతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. అంకితభావంతో విధులు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రగతికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం ద్వారా మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణ కుమార్, రమేష్, మోహన్ రెడ్డి , ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
