ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం చిత్రం న్యూస్, బేల: మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను శుక్రవారం ఘనంగా సన్మానించారు. బేల మండల విద్యాధికారి మహాలక్ష్మి ఆధ్వర్యంలో బేల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపికైన ఉపాధ్యాయులను శాలువా, ప్రశంసా పత్రంతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. అంకితభావంతో విధులు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రగతికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం ద్వారా మరింత...