అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని వినతి పత్రం అందజేత
చిత్రం న్యూస్, బాసర : అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని బాసర బీజేపీ మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ అన్నారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో ఎంపీడీవో దేవేందర్ రెడ్డికి సీ.హెచ్ సాయినాథ్ తో కలిసి వినతి పత్రం అందజేశారు. అర్హులైన లబ్ధిదారులు గత ఎనిమిది నెలల నుండి ఇంటిని మొత్తం కూల్చివేసి అద్దె ఇంట్లో ఉంటున్నారన్నారు. అటువంటి వారికి వెంటనే మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. స్పందించిన ఎంపీడీఓ పెండింగ్ లో ఏమీ లేవన్నారు. కలెక్టర్ నుంచి ఆదేశాలు రాగానే మంజూరు చేస్తామన్నారు.

