రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మిగతా కూలీలకు గాయాలు, భైంసా ఏరియా ఆసుపత్రికి తరలింపు
చిత్రం న్యూస్, బాసర :నిర్మల్ జిల్లా బాసర మండలంలోని టాక్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ముథోల్ నుంచి బాసరకు కూలీలను ఎక్కించుకొని ఆటోలో వెళ్తున్నారు. బాసర – బైంసా రహదారిపై టాక్లి సమీపంలో ఎదురుగా వస్తున్న జేసీబీ మలపడంతో ఆటోను ఢీకొంది. ముథోల్ కు చెందిన రుమోళ్ల పోతన్న (28) అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా కూలీలు గాయపడ్డారు. చికిత్స కోసం బైంసా ఏరియా హాస్పిటల్ కు తరలించారు. బాసర సీఐ కిరణ్ కుమార్, ఏఎస్ఐ గంగాధర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు



