-Advertisement-

బాసర ఆర్జీయూకేటీలో కొండచిలువ కలకలం

 బాసర ఆర్జీయూకేటీలో కొండచిలువ కలకలం

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ కళాశాల పరిసరాల్లో కొండచిలువ కలకలం రేపింది. చుట్టూ చెత్త, పిచ్చి మొక్కలు, పుట్టలు ఉండడంతో ఈ కాలేజీ పాములకు కేరాఫ్‌గా మారింది. కళాశాలలో వివిధ రకాల చెట్లు బారీగా పెరగడంతో పాములు, కొండచిలువవలకు ఆవాసంగా మారింది. హ్యుమానిట్స్ బిల్డింగ్ ప్రాంగణంలో పాము కలకలం రేపడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న రాము స్పందించి రెండు పాములను పట్టుకున్న తర్వాత వాటిని సురక్షితంగా గోనె సంచిలో పెట్టి కళాశాలకు దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో సిబ్బంది విద్యార్థిని, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments