జైనథ్ కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటిన వైష్ణవి: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అద్భుత ప్రతిభ!
చిత్రం న్యూస్,జైనథ్: మండల కేంద్రానికి చెందిన గాతాడే వైష్ణవి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో సంచలనం సృష్టించింది. బైపీసీ (BiPC) విభాగంలో 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది.
జైనథ్ గ్రామానికి చెందిన గాతాడే అనిల్ కుమార్తె వైష్ణవి చిన్నప్పటి నుండి చదువులో ఎంతో చురుగ్గా ఉండేది. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తన ప్రతిభతో అగ్రస్థానంలో నిలిచి, అటు తల్లిదండ్రులకు, ఇటు జైనథ్ గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చింది. 438 మార్కులతో జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.
వైష్ణవి సాధించిన ఈ అద్భుత విజయంపై స్థానికులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జైనథ్ పేరును రాష్ట్రస్థాయిలో నిలబెట్టినందుకు ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైష్ణవి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆమె భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. వైష్ణవి తల్లిదండ్రులు తమ కుమార్తె సాధించిన విజయం పట్ల ఎంతో గర్వంగా ఉన్నామని తెలియజేశారు.

