-Advertisement-

మహిళా అక్షరాస్యతకు జ్యోతిబా ఫులే ఎనలేని కృషి: ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మహిళా అక్షరాస్యతకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా ఫులే అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జ్యోతిబా ఫులే జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మహిళల కోసం సతీమణి సావిత్రి భాయి ఫులేతో కలిసి మొట్టమొదటి పాఠశాలను నెలకొల్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సమాజంలో సమానత్వం, విద్య, న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహాయోధుడు అని తెలిపారు. ప్రధానంగా మహిళల విద్యకు ఆయన చేసిన సేవలు అపూర్వమైనవని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని లక్ష్యంతో సత్యశోధకు సమాజాన్ని స్థాపించారని గుర్తు చేశారు. ఒక మహానుభావుడిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడం అందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, కార్పొరేటర్లు జ్యోతి మురళి, మల్లేష్ యాదవ్, బెల్లాల్ శశాంక్, జగదీష్ కులకర్ణి, బంటు ప్రీతి ప్రవీణ్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments