చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేలలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా, రమణీయంగా జరిగింది. మండల కేంద్రంతో పాటు డోప్ఠాల, మసాల ( బి ) గ్రామాల్లో భక్తుల సమక్షంలో అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా సాగింది.రామయ్య తండ్రి, సీతమ్మ తల్లికి ప్రత్యేక అలంకరణలు, అర్చనలు చేశారు. ఆయా గ్రామాల్లో భక్తుల జయ జయ ద్వానాలతో ఆలయ ప్రాంగణాలు శ్రీరామ నామస్మరణతో మార్మోగింది..రాముడు పుట్టిన రోజు వేడుక, పట్టాభిషిక్తుడైన వేడుక ఒకే రోజున కావడంతో జన్మోత్సవం, కళ్యాణోత్సవం వేడుకలు నిర్వహిస్తామని పండితులు తెలిపారు. లోకంలో ఎవరికీ లేని 16 సుగుణాలన్నీ ఒక్క శ్రీరాముడికే ఉన్నాయని, ధర్మానికి ప్రతిరూపుడని, ఆయన పాలన రామరాజ్యంగా ప్రజ్వరిల్లిందని పేర్కొన్నారు. అందుకే రాముడిని సకల గుణ సంపన్నుడిగా అభివర్ణిస్తారని కొనియాడారు. భక్తులు స్వామి వారి కల్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకటించారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.




