చిత్రం న్యూస్, హైదరాబాద్: భూభారతి పోర్టల్ తుది దశకు చేరుకుంది. రైతులకు పారదర్శకమైన సేవలందించడమే లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ రూపొందించినట్లు తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయనున్నట్లు ప్రకటించారు. భూసర్వే నుంచి రిజిస్ట్రేషన్ వరకు.. అంతా ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. సచివాలయంలో రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎన్ఐసీ అధికారులతో మంత్రి పొంగులేటి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.




