చిత్రం న్యూస్, వనపర్తి:ఈ నెల 29న హైదరాబాదులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబోయే మహా ధర్నా పోస్టర్ ను అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు భరత్, ఉపాధ్యక్షులు మహేందర్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు భరత్ మాట్లాడుతూరాష్ట్ర వ్యాప్త అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీలను రద్దుచేసి వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, గత రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వానికి విన్నవిస్తున్న స్పందించడం లేదని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే మహా ధర్నా నిర్వహించడం జరుగుతుందని ఈ ధర్నాకు జిల్లాలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శివం, గోవిందు, రవి, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.




