-Advertisement-

బాసర ట్రిపుల్ ఐటీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి

*విద్యార్థి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి 

*అసెంబ్లీ లో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

చిత్రం న్యూస్, ముథోల్: 2014వ సంవత్సరం నుండి బాసర ట్రిపుల్ ఐటీ లో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ట్రిపుల్ ఐటీ సమస్యలపై మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ట్రిపుల్ ఐటీ విద్యార్థి తేజస్విని మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ ఘటన జరిగిందన్నారు. సరైన వైద్య సేవలు అందకపోవడం మూలంగానే ఒక నిండు ప్రాణం బలైంది అన్నారు. ట్రిపుల్ ఐటీ లో సమస్యలు రాజ్యమేలుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గత ఆరు సంవత్సరాల క్రితం అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ కొన్ని కంప్యూటర్లు మాత్రమే ఇచ్చారని, విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు లేకపోవడం వలన విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోతున్నారన్నారు. పేర్లు మార్చి అదే మెస్ కాంట్రాక్టర్లు సంవత్సరాల తరబడి ఉంటున్నారని, నామినేషన్ పద్ధతిని తొలగించి టెండర్లు వేయాలన్నారు. ట్రిపుల్ ఐటీ పర్యవేక్షణకు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, విద్యావంతులతో కూడిన ఒక కమిటీని  వేయాలన్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నియామకాల ప్రక్రియ పారదర్శకంగా లేదని, సమస్యలు అడిగితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని అధికారులు విద్యార్థులను బెదిరిస్తున్నారని అన్నారు అక్కడ ఉన్న బేకరీ యజమాని ఇష్టానుసారంగా వ్యవహారిస్తూ అధిక ధరలకు అమ్మి విద్యార్థులను నిలువుగా దోచుకుంటున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు.

28 ప్యాకేజీ కి నిధులు ఇవ్వండి:

ప్రాణహిత, చేవెళ్ల 28 ప్యాకేజీ పనులు పూర్తిఅయితే ముథోల్ నియోజకవర్గం లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అసెంబ్లీ లో కోరారు. కేవలం ఎకరానికి 75 వేలు మాత్రమే సాగునీటికి ఖర్చు అవుతున్నాయని తక్షణమే నిధులు ఇస్తే మా నియోజకవర్గం సస్యశామలం అవుతుందన్నారు. గత ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్య వైఖరి మూలంగా 28 ప్యాకేజీ పూర్తి కాలేదని ఇప్పటి ప్రభుత్వం అయినా దృష్టి సారించాలని కోరారు.

కరెంటు సమస్య తీర్చండి

నియోజకవర్గం లో మొక్క జొన్న, వరి పంటలు అధికంగా సాగుచేస్తారని, ప్రస్తుతం విద్యుత్ సరఫరా లో అంతరాయం తో పంటలకు రైతులు నీరు అందించలేక పోతున్నారని, సమస్యను తీర్చాలని ఎమ్మెల్యే అసెంబ్లీ లో కోరారు.. మరొక్క 33/ 11 కె. వి. సబ్ స్టేషన్ మంజూరు చేయాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments