-Advertisement-

రైతు భరోసా నిధులు విడుదల చేసేవరకు పోరాడతాం 

బీఆర్ఎస్  యువ నాయకులు సతీష్ పవార్ 

చిత్రం న్యూస్ బేల: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా విషయంలో  పూటకోమాట మాట్లాడుతుందని, ఈ ప్రభుత్వం మాటల్లో తప్ప చేతుల్లో ఏ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని బీఆర్ఎస్ యువ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అధ్యక్షతన, గ్రంథాలయ జిల్లా మాజీ చైర్మన్ రౌతు మనోహర్ సహకారంతో గ్రామ గ్రామాల్లో వెళ్లి రైతుల వద్ద నుంచి సంతకాల సేకరించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 70% రైతులు ఉన్నారని మూడు దపాలుగా రైతుభరోసా వేయకుండా వారితో చెలగాటం ఆడటం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతవరకు సభబు అని అన్నారు. సంతకాల సేకరణతో హైకోర్టుకి సమర్పించడం జరుగుతుందని, రైతుభరోసా విషయాన్ని హరీష్ రావు అసెంబ్లీలో లేవనెత్తుతాడని భయంతో ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు వేస్తామని ప్రకటించడం శోచనీయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోని రైతులకు మూడు కిస్తీల రైతు భరోసా పడే వరకు తమ పోరాటం ఆగదని సూచించారు. ధర్నాలు, కలెక్టరేట్, అసెంబ్లీ ముట్టడీలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఠాక్రే గంభీర్,మస్కె తేజ రావ్, మండల నాయకులు బాల్చందర్ పరాట్కర్ , జితేందర్ బెదుర్కర్,సర్పంచ్ ఖోడే విపిన్, విశాల్ గోడే , విట్టల్ వరడే,బత్తుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments