చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లాలోని బాసర మండలంలోని సవర్గం గ్రామంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు సోమవారం ఘనంగా సత్కరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సవర్గం గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను గ్రామ సర్పంచ్. గాదెకర్ ముత్తు బాయ్, ఉప సర్పంచ్ మంజూష ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రామంలో ‘పరిశుభ్రతను కాపాడుతూ.. గత కొన్ని సంవత్సరాల నుండి గ్రామంలో గల ప్రతివాడలో మురికి కాలువల నుండి చెత్త చెదారాన్ని పోగుచేసి గ్రామ చివరన గల డంపింగ్ యార్డ్ లో చెత్తను వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సేవలందిస్తున్న పారిశుద్ధ కార్మికుల సేవలను గుర్తిస్తూ సర్పంచ్ పారిశుద్ధ్య కార్మికులకును అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డ్ మెంబర్స్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

