చిత్రం న్యూస్, మణికొండ: వినోదమే ప్రధానంగా ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించడమే ధ్యేయంగా ఇంద్ర కంపెనీ ప్రొడక్షన్ NO 5, రవి రాథోడ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తూ శక్తి ప్రెసెంట్ బ్యానర్ గా , RK హీరోగా 5 వ చిత్రం ప్రారంభం కార్యక్రమం హైదరాబాద్ నగరం మణికొండలోని అభిషేక్ డాన్స్ స్టూడియోలో రాజకీయ ప్రముఖులు, సినీ దర్శకులు, నటీనటులు మధ్యన జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ డాన్స్ మాస్టర్ నటరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి హీరో, హీరోయిన్ ల పై మొదటి ముహూర్తపు షాట్ క్లాప్ కొట్టగా నిర్మాత ఇంద్ర కెమెరా ఆన్ చేశారు .మొదటి షాట్ కి హరి తాటిపల్లి దర్శకత్వం వహించారు. జబర్దస్త్ షోలో నటిస్తున్న కే ఏ పాల్ మరో అతిథిగా విచ్చేశారు. ఈ చిత్ర హీరోగా నల్లమల, ఆకాశవాణి, ప్రతిఘటన , ప్రేమికుడు , వంగవీటి , కొండా, చిత్రాలకు నృత్య దర్శకులుగా చేసిన RK హీరో గా మహాబలి, నీరుకుళ్ళ, మాఊరి బావి, ఇప్పుడు 4వ చిత్రం హీరోగా చేస్తున్నారు. హీరోయిన్ శ్రీలియ ద్వితీయ చిత్రం కాగా మరో హీరోయిన్ గా ఖుషీ రెడ్డి హీరోయిన్ గా పరిచయం చేస్తూ..అవంతిక పరదేశి హీరోయిన్ గా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సుష్మా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంద్ర కంపెనీ నుండి మొదట డేటింగ్, హార్రర్ డ్రీమ్స్ 24/7, ఘోస్ట్ గార్డ్, వాంటెడ్ బాయ్ ఫ్రెండ్, ఇప్పుడు ఈ నూతన చిత్రం ప్రొడక్షన్ 5 గా తెరకెక్కుతుంది. దర్శకునిగా కుర్రాల సుబ్బారెడ్డికీ వాంటెడ్ బాయ్ ఫ్రెండ్ మొదటి సినిమా కాగా ఇది రెండవ చిత్రం . ఈ చిత్రంలో ప్రధాన హాస్యనటుడు గా చేస్తున్న (ఇమామ్ వలి) వలి కి ఇది 7 చిత్రం కాగా ఆనంద్ కి రెండో చిత్రం. కెమెరా ఫొటోగ్రఫీగా ఫణీంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ గా ఉదయ్ కిరణ్. నృత్య దర్శకులుగా హరి తాటిపల్లి, ఫైట్ మాస్టర్ గా పీటర్ చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ జనవరి 24 నుండి హైదరాబాద్ పరిసరప్రాంతాల్లోనూ, రెండో షెడ్యూల్ ఫిబ్రవరి నెలలో 3 వారంలో వరంగల్, రాజమండ్రిలలో పూర్తికానున్న ఈ చిత్రంలో ఫణి, విజయ్ బొల్ల , సునీత, అనిత, కే ధనలక్ష్మి, శ్రీహరి, ఆనంద్, జబర్దస్త్ బాబు నటించనుండగా మిగతా నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తామని దర్శకులు తెలిపారు.

