ఘనంగా శ్రీ శబరిమాత ఆలయ వార్షికోత్సవం
నేరడిగొండ, చిత్రం న్యూస్: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలోని శ్రీ శబరిమాత 3 వ ఆలయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులు శివానంద భారతి, దేవన్న స్వామి, బాలయ్య స్వామి శబరీ మాత ఆలయంలో గల విగ్రహాలకు పూజలు నిర్వహించారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుండి గ్రామ గ్రామాన శబరిమాత భక్తులు కుమారి గ్రామ భక్తులతో కలిసి వీధుల గుండా శబరిమాత పల్లకీ ఊరేగింపులో పాల్గొన్నారు. మహిళలు, పెద్దలు, చిన్నలు నృత్యాలు చేస్తూ శబరమ్మ పాటలు పాడుతూ భక్తి పారవశ్యంతో ముందుకు సాగారు. అనంతరం శివానంద భారతి స్వామి మాట్లాడుతూ. శబరమ్మ చెప్పిన బాటలో నడుస్తే జీవితం మారుతుందన్నారు ఆశ్రమ చైర్మన్ డోకూర్ భోజన్న, డి.భోజ గౌడ్, బిక్క లస్మన్న, బొడ్డు సుభాష్ గౌడ్, చాట్ల భూమేష్, చెమ్మనా పురుషోత్తం, పొచ్చర నారాయణ రెడ్డి, గొర్ల మనోహర్, బిక్క అడేల్లు తదితరులు పాల్గొన్నారు.

