చిత్రం న్యూస్, ఆదిలాబాద్:
బీసీ బిల్లు ఆమోదం చారిత్రాత్మక విజయం
*తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి
అసెంబ్లీ సమావేశాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీల బిల్లు ఆమోదం పొందడంపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తొలుత నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బీసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీసి రిజర్వేషన్లు అమలు చేసే ఘనత కాంగ్రెస్ పార్టీకె దక్కుతుందన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి కేసీఆర్ బీసీలను అణగదొక్కారని.. కేసీఆర్ చేసిన బీసి బిల్లు బీసిలకు మరణ శాసనం అయ్యిందన్నారు. బీసి కుల గణన చేసి పకడ్బందీగా బీసి బిల్లు తెచ్చి బీసిలకు రాజకీయ సుస్థిర స్థానం కల్పిస్తున్న ఘనత, ప్రజా పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేల ఆశయాల మేరకు ఎవరి జనాభా ప్రకారం వారి వాటా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి ఈ విషయాన్ని విస్తృతంగా తీసుకువెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతిపక్ష నాయకులకు ఆయన కృతజ్ఞతలు లిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చర్యలను సమాజం సంపూర్ణంగా స్వాగతించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మునిగెల నర్సింగ్, మావల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల నాగరాజు, మాజీ టౌన్ అధ్యక్షులు ఎండీ వసీం, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ మెంబర్ రహీమ్ ఖాన్, సీనియర్ నాయకులు తడిసెన వెంకట్ రెడ్డి, నలిమేల నవీన్ రెడ్డి, బండి దేవిదాస్ చారి, sk రాజ్ మహమ్మద్, కోరాటి ప్రభాకర్, మర్సకోల్ల గౌతమ్, రేండ్ల రాజన్న, పోచారం, ఎండీ అప్సర్, సమీ ఉల్లా ఖాన్, sk అలీమ్, ,sk ఫహీమ్, sk అజీజ్, ఎంఏ హర్షత్, వెంకటేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.