వరద నీటిలో మునిగిన ఇచ్చోడ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్
చిత్రం న్యూస్ బోథ్: ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి ఇచ్చోడ మండల కేంద్రంలో గల బాలికల రెసిడెన్షియల్ పాఠశాల వరద నీటితో మునిగింది. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తక్షణమే పాఠశాలకు చేరి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. బోథ్ నియోజకవర్గంలో ఎక్కడ ఇబ్బందులు ఉన్న వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు పరిస్థితులను తనకు అందజేయాలని సూచించారు. వీరి వెంట మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.