బేల ఎస్ఐ మధు కృష్ణను కలిసిన భజరంగ్ దళ్ నాయకులు
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల నూతన ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన యానకి మధుకృష్ణను భజరంగ్ దళ్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. భజరంగ్ దళ్ అధ్యక్షుడు అగార్కర్ ఆకాష్ మాట్లాడుతూ..శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భజరంగ్ దళ్ బేల మండల ఉపాధ్యక్షులు ముజుంధర్ ప్రీతమ్ సభ్యులు మనిష్,నీపూంగే, సచిన్, అనికేత్, సూరజ్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు.

