Chitram news
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 5:24 pm Editor : Chitram news

మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి- డీఎల్ఎస్ఏ కార్యదర్శి బి.హుస్సేన్

మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి- డీఎల్ఎస్ఏ కార్యదర్శి బి.హుస్సేన్

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంరక్షణ ప్రత్యేక పాఠశాలలో ఏర్పాటు చేసిన విజ్ఞాన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.హుస్సేన్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యంపై అవగాహన ,మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత, ఒత్తిడిని అధిగమించే మార్గాలు, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన సహకారంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత కాలంలో విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు వివిధ కారణాలతో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడటం, తగినంత నిద్ర, వ్యాయామం, యోగా, ధ్యానం వంటి అలవాట్లను పాటించడం మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి. సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే నిపుణుల సలహా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పాఠశాల విద్యార్థులు పేర్చిన బతుకమ్మ వేడుకలు ప్రారంభించడం జరిగింది. అనంతరం పాఠశాలలో మౌలిక వసతులు సదుపాయాల గురించి పాఠశాల విద్యార్థులతో,సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్,అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలే,  సిబ్బంది,పాఠశాల సిబ్బంది ,ప్రత్యేక పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.