చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: డీఎల్ఎస్ఏ కార్యదర్శి బి.హుస్సేన్
చిత్రం న్యూస్, తలమడుగు: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.హుస్సేన్ అన్నారు. తలమడుగు మండలం కొసాయి గ్రామంలో పేదరిక నిర్మూలన, ఉచిత న్యాయ సహాయం పై మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులకు సోషల్ మీడియా, విద్యా హక్కు, ఉచిత న్యాయ సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్, చైల్డ్ మ్యారేజ్,ఫారెస్ట్ చట్టాలు, రైతులకు నకిలీ విత్తనాలు, మందులపై తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ శైలజ రవి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలే,ఫారెస్ట్ అధికారులు, ,గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.