మాజీ సీఎం కేసీఆర్ పై వినూత్న అభిమానాన్ని చాటిన రైతులు
మాజీ సీఎం కేసీఆర్ పై వినూత్న అభిమానాన్ని చాటిన రైతులు చిత్రం న్యూస్, జైనథ్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పై ఉన్న అభిమానాన్ని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులు వినూత్న రీతిలో చాటుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగే 'పొలాల అమావాస్య' (పోలా) పండుగ వేడుకల్లో భాగంగా జైనథ్ మండలం కరంజి (కె) గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ ఎడ్లను గులాబీ రంగు...