చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నగరంలో సెల్ఫోన్లు పోగొట్టుకుని ఫిర్యాదు చేసిన బాధితులకు వాటిని ట్రేస్ చేసి తిరిగి అందజేసినట్లు వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్హెచ్వో మాట్లాడుతూ.. వన్ టౌన్ పరిధిలో 20మంది బాధితులు తమ ఫోన్లు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు చేశారన్నారు. ఈ సందర్భంగా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వాటిని ట్రేస్ చేసి తిరిగి బాధితులకు శనివారం అందజేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొబైల్ఫోన్లు జాగ్రత్తగా చూసుకోవాలని.. ఒకవేళ పోగొట్టుకున్నట్లయితే వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.




