చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిత్యం వాహనాలు నడిపే డ్రైవర్లు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సూచించారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మోపాల్ ఎస్ హెచ్ ఓ జెడ్. సుస్మిత ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్, జీజీహెచ్ నిజామాబాద్ సహకారంతో మోపాల్లో డ్రైవర్లకు కంటి, చెవి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ.. భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు ఎల్లప్పుడూ కంటి, చెవి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్యం బాగుంటేనే వాహనాలు సక్రమంగా నడపగలుగుతామని వివరించారు. శిబిరంలో సుమారు 80 మంది డ్రైవర్లు, 30 మంది మోపాల్ గ్రామస్థులకు వైద్యులు అమర్దీపిక, శ్రవంతి, లయన్స్ క్లబ్ బృందం సభ్యులు చెవి, కంటి పరీక్షలునిర్వహించారు. అనంతరం పలువురు డ్రైవర్లకు కళ్లద్దాలు సైతం అందజేశారు. కార్యక్రమంలో సౌత్ రూరల్ సీఐ సురేష్, మోపాల్ ఎస్ హెచ్ ఓ జెడ్. సుస్మిత తదితరులు పాల్గొన్నారు.

