Home Blog Page 99

రేషన్ బియ్యంలో  కేంద్రం వాటానే ఎక్కువ

కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రామారావు పటేల్ 

చిత్రం న్యూస్, భైంసా: రేషన్‌ బియ్యంలో కేంద్రం వాటానే ఎక్కువ అని ఎమ్మెల్యే  రామారావ్ పటేల్ అన్నారు. బుధవారం సూరలోక గార్డెన్ లో లబ్ధిదారులకు కొత్త ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత దేశంలో వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ ప్రవేశ పెట్టిందే బీజేపీ (BJP) ప్రభుత్వమని, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా తెలంగాణలో కూడా తెల్లరేషన్‌ కార్డు కల్గిన ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల బియ్యం మూడు సంవత్సరాల నుంచి ఉచితంగా అందిస్తోంది నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వమన్నారు. రేషన్ బియ్యం కోసం కిలోకు రూ.40  కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. గత పాలకులు 10 సంవత్సరాల పాటు రేషన్ కార్డులు ఇవ్వక పోవడంతో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం మంచి పరిణామం అన్నారు. నా హయాంలో నియోజకవర్గంలో 17 వేల కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం సంతోషంగా ఉందన్నారు. కార్డుల పంపిణి ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, పాల్గొన్నారు.

✖ Close హోం

జిల్లా  ఎస్పీని కలిసిన బోథ్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడాల అనీష్ కుమార్

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను సన్నానిస్తున్న బోథ్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడాల అనీష్ కుమార్

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా డీపీవో కార్యాలయంలో  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ని బోథ్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడాల అనీష్ కుమార్, నడికుంట ప్రవీణ్ తో కలిసి మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. నూతన మండలం సొనాలలో తొందరగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయ్యేలా కృషి చేయాలని విన్నవించారు. మండల పరిధిలో సివిల్, మినల్ కేసులు ఎక్కువగా నమోదు కావడం, మహారాష్ట్ర సరిహద్దుల్లో మండలం ఉండడం వలన గుర్తు తెలియని వ్యక్తులతో మండల ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పదుతున్నాయని వివరించారు. వీటి నివారణకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు తప్పనిసరిగా మారిందని విన్నవించగా ఎస్పీ అఖిల్ మహాజన్ వీలైనంత తొందరలో అయ్యేలా కృషి చేస్తానని చెప్పారని తెలిపారు.  ఎస్పీ మాట్లాడుతూ యువత యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా మారి సమాజానికి సేవ చేయాలని, యువకులు ఉన్నత స్థానాలకు ఎదిగి తమ గ్రామాల పేరును, కీర్తి ని పతాక స్థాయికి చేర్చాలని, చెడు వ్యసనాల బారిన పడకుండా సన్మార్గం వైపు పయనించాలన్నారు.

✖ Close హోం

ఎన్టీఆర్ అపార్ట్ మెంట్ లో  వాటర్  సమస్యను తక్షణమే పరిష్కరించాలి.

0

మహిళలతో మాట్లాడుతున్న  మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్

చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలోని ఎన్టీఆర్ అపార్ట్మెంట్లో నెలకొన్న వాటర్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆ ప్రాంత మహిళలు పెద్ద ఎత్తున మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ స్వగృహంకు వెళ్ళి సమస్యను తెలియజేశారు. గత మూడు రోజులుగా వాటర్ ట్యాంకు ద్వారా మంచినీటిని పంపిస్తున్న దాహార్తితో ప్రజలు అల్లాడుతున్నారని మహిళలు వాపోయారు. మున్సిపల్ యంత్రాంగం దృష్టికి తీసుకొని వెళ్లి త్రాగునీరు సమస్యపై బోర్ వెల్ వేసేలాగ చర్యలు తీసుకుంటామని నెక్కంటి సాయిప్రసాద్ మహిళలకు హామీ ఇచ్చారు.

✖ Close హోం

బోథ్ మండలం బాబేర తండాలో  ఘనంగా తీజ్ పండుగ

 తీజ్ పండగలో  మహిళలు, యువతులు

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం బాబేర తండాలో  ఘనంగా తీజ్ పండుగ నిర్వహించారు.  బంజారా సంస్కృతిలో బంజారా తెగలో తీజ్ పండుగను మొలకల పండుగ అని కూడా పిలుస్తారు. ఇది వారి సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. వివాహిత స్త్రీలు భర్త కోసం, పెళ్లికానిజ్ అమ్మాయిలు తమ కాబోయే భర్త దీర్ఘాయువు కోసం పూజలు చేశారు. తమ భర్తల శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉండి ప్రార్థించారు. వర్షాకాలం రాకను స్వాగతిస్తూ  ఈ పండగను జరుపుకుంటారు. మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తులు, ఆభరణాలు,  ప్రత్యేకంగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి, సాంప్రదాయ ఆభరణాలను ధరించి సందడి చేస్తారు. ఊయల ఊగుతూ.. జానపద పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.

✖ Close హోం

ఆదివాసుల సంక్షేమానికి ప్రత్యేక కృషి- పాయల్ శంకర్ 

చప్రాలలో  శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే  పాయల్ శంకర్ 

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాల గ్రామంలో జన్ మన్ పథకం కింద రూ.2.30 కోట్ల  నిధుల వ్యయంతో నిర్మించనున్న బాలుర హాస్టల్ బిల్డింగ్ నిర్మాణ పనులకు మంగళవారం భూమి పూజ చేసి శిలా ఫలకం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ..ఆదివాసుల అభివృద్ధికి కేంద్రం జన్ మన్ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. జన్ మన్ నిధుల ద్వారా ఆదివాసి గ్రామాల నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే ముఖ్య లక్ష్యం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ  వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు వందల కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పూర్తయి ప్రారంభ దశలో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో  బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

✖ Close హోం

స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలి

0

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రావుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న మేకల జితేందర్

చిత్రం న్యూస్, బేల: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం, జెండా మోసి కష్టపడి పనిచేసిన వారికి టిక్కెట్లు ఇవ్వాలని యువజన కాంగ్రెస్ బేల మండల సోషల్ మీడియా కన్వీనర్ మేకల జితేందర్ కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ మినిస్టర్ క్వాటర్స్ లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో కృషి చేయడం జరిగిందని తెలిపారు. రిజర్వేషన్ల ఆధారంగా అవకాశం కల్పించి వారి గెలుపుకు సహకరించాలని కోరారు.

✖ Close హోం

సమస్యల పరిష్కారానికి దశాల వారీగా పోరాటాలు 

పోరాటాలకు సంబంధించి కరపత్రాలు విడుదల చేస్తున్న ఎంఇఓ కోల నరసింహులు, ప్రధానోపాధ్యాయుడు జాడి సుదర్శన్

చిత్రం న్యూస్, బేల: పాఠశాల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ( యూఎస్పీసీ) ఆధ్వర్యంలో దశలవారీగా పోరాట కార్యక్రమాలు చేపడుతున్నట్టు టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు అశోక్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి కోల నరసింహులు, ప్రధానోపాధ్యాయులు జాడి సుదర్శన్ చేతుల మీదుగా పోరాటాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఆగస్టు 1న జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. కార్యక్రమంలో సంఘం నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం 

హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తున్న నియోజకవర్గ ఇంఛార్జి వొడితల  ప్రణవ్ 

చిత్రం న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా హుజురాబాద్,మండలం వీణవంక, ఇల్లందకుంట,కమలాపూర్ మండలాల లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు లతో కలిసి నియోజకవర్గ ఇంఛార్జి వొడితల  ప్రణవ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో  ఇందిరమ్మ ఇళ్లు, సబ్సిడీ గ్యాస్, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు,  మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నూతన రేషన్ కార్డులు ఇలా అనేక కార్య క్రమాలు చేపడుతూ..ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సీఎం  రేవంత్ రెడ్డి  పాలనలో  అభివృద్ధిలో ముందుకు వెళుతున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

 

✖ Close హోం

బేల పశువైద్యశాలలో కనీస సౌకర్యాలు లేక  రైతులకు ఇబ్బంది

బేల పశువైద్యశాలలో కనీస సౌకర్యాలు లేక  రైతులకు ఇబ్బంది

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని పశువైద్యశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడం రైతులకు తీవ్ర ఇబ్బంది అవుతుందని ఎమ్మార్పీఎస్ బేల మండల అధ్యక్షుడు అంకుష్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బేల లోని పశువైద్యశాలలో ప్రస్తుతం వైద్య సిబ్బంది లేరు. మార్గదర్శక వనరులు, ఔషధాల కొరత, అధునాతన సౌకర్యాలు లేకపోవడంతో రైతులు  తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అతివేగంగా వ్యాపించే పశువుల వ్యాధులకు చికిత్స లేకపోవడం వల్ల పశు సంపద నష్టపోతుందని, రైతులకు ఆర్థికంగా భారమవుతోందన్నారు.శాశ్వత వైద్యుడు లేక, అత్యవసర చికిత్సా సామగ్రి, ప్రాథమిక ల్యాబ్, నిర్దిష్ట ఔషధ నిల్వలు ఈ సేవలు లేకుండా పశువైద్యశాల నామమాత్రంగా ఉందన్నారు.  పూర్తిస్థాయిలో పశువైద్య సౌకర్యాలను ఏర్పాటు చేయాలని  పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో,రమేష్, అంకుష్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన

సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన

చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల గురించి హెల్త్ అసిస్టెంట్లు రాథోడ్ కైలాష్, సుభాష్ కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలలో కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, పాత కుండలు, పనికిరాని వస్తువులను ఉంచుకోరాదని, దానిలో వర్షపు నీరు పడి దోమల లార్వా వృద్ధి చెంది డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయని అన్నారు. దోమ పుట్టుక గురించి, దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి, దోమల నివారణ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు పద్మ, సుధారాణి, కాలనీవాసులు పాల్గొన్నారు.

✖ Close హోం