చిత్రం న్యూస్, బోథ్ : నిర్మల్ నుంచి బోథ్ కు అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక లారీని పట్టుకున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు వాహనానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేని కారణంగా లారీని బోథ్ పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని స్థానిక శ్రీరామ ఆలయ కమ్యూనిటీ హాల్లో బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో 77వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం యువకులు, వయోజనులు కలిసి దాదాపుగా 20మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరీ వినోద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏబీవీపీలో పనిచేసిన వారు మంత్రులుగా, సీఎంగా, కేంద్ర మంత్రులుగా పని చేస్తున్నారని గుర్తు చేశారు. జాతీయ పునర్నిర్మాణం కోసం విద్యార్ధి పరిషత్ పని చేస్తుందని అన్నారు. నేటి యువత వివేకానంద ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం అలుపెరుగని ఉద్యమాలు, అంతులేని పోరాటాలు చేస్తూ విద్యార్థులకు, సమాజానికి ఏబీవీపీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్లు నిఖిల్, మహేష్,మాడవార్ హరీష్ రెడ్డి,నాయకులు మనోజ్ రెడ్డి,నార్లవార్ అజయ్, తరుణ్,కుర్మా పవన్ రెడ్డి,సాయి రెడ్డి, రిమ్స్ వైద్య బృం దం, ఆయా పార్టీ నాయకులు పోత్ రాజ్ నవీన్, బర్కాడే రాము, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రి అందజేత
పేద విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రి అందజేత
*సమనుజ్ఞ ట్రస్ట్ ఛైర్మన్ కుర్మే విశ్వనాథ్ ఉదారత
చిత్రం న్యూస్, తలమడుగు: తలమడుగు మండలంలోని లచ్చంపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సమనుజ్ఞ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్టు చైర్మన్, న్యాయవాది కే.విశ్వనాథ్ పేద విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేసి ఉదారత చాటారు. గురువారం పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నోట్ బుక్కులు, పెన్నులు, పెన్సిల్లు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్టు వైస్ ఛైర్మన్ సోని, ఆదిలాబాద్ మండల మాజీ ఎంపీపీ బాయిన్ వార్ గంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు మామిడి లక్ష్మణ్, కతులాపూర్ శ్రీనివాస, మాజీ సర్పంచ్ ముల్కల రాజేశ్వర్, గ్రామ పెద్ద ఎడ్ల ఆశన్న, ఎడ్ల చిన్న ఆశన్న, యూత్ ప్రెసిడెంట్ సారంగుల రవి, దువాస భగవాన్లు, దొనపెల్లి రాజు, హెచ్ఎం. శ్రీనివాస్, టీచర్ కల్పన, విద్యార్థులు. ఉపాధ్యాయులు, గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది, ట్రస్ట్ చైర్మన్ కుర్మే విశ్వనాథ్ మాట్లాడుతూ..ఆదిలాబాద్ జిల్లా లోని అట్టడుగు పేద విద్యార్థులకు మా ట్రస్ట్ తరపున ఉన్నత చదువుల కోసం భవిష్యత్తులో అనేక సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ తుల అరుణ్
చిత్రం న్యూస్, సొనాల: సొనాల మండలంలోని చింతల్ బోరి గ్రామంలోని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర విచార్ విభాగ్ కోఆర్డినేటర్ తుల అరుణ్ వీరికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చింతల్ బోరి గ్రామ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదవారందరికీ రేషన్ కార్డులు అందిస్తుందని, అదేవిధంగా సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, వడ్డీ లేని రుణాలు, రాజీవ్ యువ వికాసం ఎన్నో పథకాలు ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ ముండే, గాజుల పోతన్న, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల, పీఏసీఎస్ డైరెక్టర్ పోశెట్టి, ఆత్మ డైరెక్టర్ ముండే శ్రీధర్, సొనాల గ్రామ పట్టణ అధ్యక్షులు అనిల్, బీసీ సెల్ చైర్మన్ భోజన్న, శ్రీరామ్ గైక్వాడ్, సంతోష్ ధన్వే, దేవిదాస్, గంగారామ్ తన్వే, జాదవ్ సదానంద్, కోరుట్ల వినోద్, మారుతి, జాదా మోహన్, ధన్వే దొండిబా తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సీతక్క జన్మదిన వేడుకలు
ఘనంగా మంత్రి సీతక్క జన్మదిన వేడుకలు
చిత్రం న్యూస్, బోథ్: బోథ్ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ గోర్ల రాజు యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేకు కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేరుగు భోజన్న, ఆబూద్, దోర రాజశేఖర్, కుర్మే గంగారాం, మేర గంగాధర్, పసుల చంటి, పడిగల పీటర్ భోజన్న, గడ్డల నారాయణ, వడ్లకొండ సురేందర్, మేరుగు దాసు, స్వామి రెడ్డి పాల్గొన్నారు.
శాంతి భద్రతలే ప్రథమ కర్తవ్యం
మీ కోసం పోలీస్ అవగాహన కార్యక్రమంలో బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ. వెంకటేశ్వరరావు,
ఎస్ఐ ప్రవీణ్
చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండలంలోని దన్నూరు (బి) గ్రామంలో మంగళవారం మీకోసం పోలీస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో బోథ్ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ.వెంకటేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ లు మాట్లాడుతూ.. శాంతి భద్రతలే మా ప్రథమ కర్తవ్యమని, మీకోసం పోలీస్ కార్యక్రమం ప్రజలకు మరింత చేరువ చేయడానికేనని పేర్కొన్నారు. అలాగే పలు అంశాలపై గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా భూ తగాదాల విషయమై సమస్యలను, మత్తు మాదకద్రవ్యాలు వల్ల నష్టాలు, మద్యం సేవించడం వల్ల జీవితంలో ఎదుర్కొనే ఒడిదుడుకులు, సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు వీటి పైన గ్రామస్తులకు వివరిస్తూ తగు జాగ్రత్తలను సూచించారు. ముఖ్యంగా మానసికంగా ప్రతి సమస్య ఎదుర్కోవాలని, ఆత్మహత్యలే పరిష్కారం ఒకటే జీవితానికి కాదని, ఆలోచనతో ముందుకు సాగాలని తెలిపారు. ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగిన తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మద్యం సేవించి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని చెప్పారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కష్టపడి పని చేసుకొని బ్రతకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంత వారినైనా శిక్షించడానికి పోలీస్ వ్యవస్థ ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు పోలీస్ సిబ్బంది, యువత, తదితరులు పాల్గొన్నారు.
విచారణ అనంతరం హాకా సెంటర్ పై చర్యలు
విచారణ అనంతరం హాకా సెంటర్ పై చర్యలు
చిత్రం న్యూస్, బేల: విచారణ అనంతరం హాకా సెంటర్ పై చర్యలు తీసుకుంటామని ఏడీ శ్రీధర్ అన్నారు. బేల మండలంలో హాకా సెంటర్ నుండి అక్రమంగా తరలిస్తున్న యూరియాను రైతులు పట్టుకోవడంతో వ్యవసాయ అధికారులు అప్రమత్తం అయి సదరు వ్యక్తి పైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఏడి శ్రీధర్ మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న యూరియా ను రైతులు పట్టుకోవడంతో వెంటనే వ్యవసాయ అధికారులను పంపించడం జరిగిందని అన్నారు. విచారణ చేపట్టి హాకా సెంటర్ లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు. హాకా సెంటర్లో 440 యూరియా బస్తాలు ఉన్నాయని, మిగితా 200 యూరియా బస్తాలు అక్రమంగా మహారాష్ట్ర కు తరలించారని అన్నారు. ఇందులో రెండు బండ్లు వంద చొప్పున యూరియా బస్తాలు తీసుకెళ్తున్నారని సిర్సన్న రైతులు ఒక బండిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారన్నారు. రెండవ బండి దహెగావ్ గ్రామంలోని బీజేపీ మాజీ మండల అధ్యక్షులు నిక్కం దత్త ఇంటి సమీపంలో లోడ్ చేశారు. దీని పైన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
బోథ్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
బోథ్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలు రికార్డులు పరిశీలించిన ఆయన సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణం లో ఉన్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి సదరు గుత్తేదారుతో మాట్లాడి తొందరగా పనులు పూర్తి చేయాలని అదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి డాక్టర్ ను ఆదేశించారు. అనంతరం ల్యాబ్ ను సందర్శించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ల్యాబ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సమయ పాలన పాటించాలని మూడు షిఫ్ట్ లుగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. బయోమెట్రిక్ విధానం అమర్చాలని సూచించారు. అంతే కాకుండా ఇంకా నూతన ల్యాబ్,బ్లడ్ బ్యాంకు సౌకర్యం కోసం, ఇతర సౌకర్యాలు కల్పన కోసం రూ.7కోట్లు నిధులు కేటాయించామని వాటికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని అన్నారు. ముఖ్యంగా గిరిజనులు ఉండే ప్రాంతం కావున వైద్యులు అప్రమత్తం గా ఉండాలని,మరియు వార్డులో బయట సీసీ కెమెరాలు అమర్చాలని స్థానిక ఎస్ఐకి సూచించారు. ఈ కార్యక్రమం లో బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి,ఆత్మ కమిటీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్,కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి తదితరులు పాల్గొన్నారు.
గుడుంబా అమ్మిన వారిపై కఠిన చర్యలు
దేశీదారు అమ్మిన వారిపై కఠిన చర్యలు
చిత్రం న్యూస్, సొనాల: దేశీదారు అమ్మిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ జుల్ఫీకర్ అహ్మద్ అన్నారు. మండలంలోని గుట్టపక్క తండ గ్రామానికి చెందిన మట్ట చందర్ సింగ్ మహారాష్ట్రకు చెందిన దేశీధారు కేసులో పలుమార్లు పట్టుబడితే తహసీల్దార్ దగ్గర బైండోవర్ చేయించడం జరిగిందన్నారు. మళ్ళీ దేశీదారు అమ్ముతూ పట్టుపడ్డాడన్నాడు. బైండోవర్ ఉల్లంఘించినందుకు రూ.50 వేల జరిమానా విధించడం జరిగిందన్నారు. మంగళవారం మట్ట చందర్ సింగ్ రూ.50 వేలు చాలన్ కట్టించినట్టు ఆయన తెలిపారు. ఎవరైనా దేశీదారు, గుడుంబా కఅమ్మినా, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంతామన్నారు. పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ జూల్ఫీకర్ అహ్మద్ హెచ్చరించారు.
మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పండ్లు పంపిణీ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పండ్లు పంపిణీ
చిత్రం న్యూస్, బోథ్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ వీరాభిమాని అల్లం మనోహర్ సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నవీన్ రెడ్డి, స్టాఫ్ ఆధ్వర్యంలో రోగులకు, గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి అనేక పథకాలు లబ్ది చేకూరాయని , గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. అలాంటి వ్యక్తిని మర్చిపోకూడదని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్ రెడ్డి,అల్లం మనోహర్, లక్ష్మణ్ యశోద,లింగారెడ్డి, రేణుక, అనసూయ, జమున తదితరులు పాల్గొన్నారు.









