Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 82

లోటస్ పాండ్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు 

0

లోటస్ పాండ్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు 

*ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు

*ప్రత్యేక ఆకర్షణగా పోతురాజుల వేషాలు 

*సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ

*పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు

చిత్రం న్యూస్, జమ్మికుంట: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ జరుపుకుంటారని ఈ పండుగకు చాలా విశిష్టత ఉన్నదని లోటస్ పాండ్ పాఠశాల కరస్పాండెంట్ చైర్మన్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని లోటస్ పాండ్ పాఠశాలలో ఆషాడ మాసం సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో  నిర్వహించిన బోనాల జాతర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేశారు. శ్రీనవదుర్గ చిత్రపటానికి పూలమాల వేసి ఉత్సవాలను ప్రారంభించారు. ప్రత్యేక మట్టి కుండలో వండిన బోనాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ అత్యంత ప్రీతికరమైనదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో తరాల నుండి అవలంభిస్తున్న  ఈ గొప్ప సాంప్రదాయం ఎటువంటి లోటు పాటు లేకుండా కొనసాగించడం చాలా శుభపరిణామం అని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలు కేవలం పల్లెల్లోనే కాకుండా నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా బోనాల పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తూ అమ్మవారికి బోనాలను సమర్పించి ఆప్యాయతలను చూపిస్తున్నారని అన్నారు. బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని అదే సంప్రదాయాన్ని నేటి తరం కొనసాగించడం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతని సంపత్ రావు అన్నారు.

విద్యార్థులు ప్రదర్శించినటువంటి బోనాల పాటలపై నృత్యాలు అందరినీ ఆకర్షింపచేశాయి. విద్యార్థులు వివిధ సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి బోనాలను ఎత్తుకొని పండుగ వాతావరణం సృష్టించారు. ప్రత్యేకంగా పోతురాజుల వేషధారణలో విచ్చేసిన చిన్నారులు చేసిన విన్యాసాలు చాలా అబ్బురపరిచాయి. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మాండగడ హెచ్ఎం గా అర్చన బాధ్యతలు

0

మాండగడ హెచ్ఎం గా అర్చన బాధ్యతలు

*హెచ్ ఎం ను సన్మానిస్తున్న కాంగ్రెస్ నాయకుడు మల్లారెడ్డి  దంపతులు, ఉపాధ్యాయులు 

చిత్రం న్యూస్, భోరజ్: మండలంలోని మాండగడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ ఎం గా అర్చన బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ హెచ్ ఎం గా విధులు నిర్వహించిన చంద్ర మణిని వేరే పాఠశాలకు సర్దుబాటు చేశారు. కాంగ్రెస్ నాయకుడు మామిడి మల్లారెడ్డి దంపతులు, మాజీ సర్పంచ్ సైపట్ మహేందర్ రావు, మాజీ ఉప సర్పంచ్ రవి యాదవ్, ఉపాధ్యాయులు  హెచ్ ఎం అర్చనను సన్మానించారు.

 

 

 

ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత

0

నోట్ బుక్స్, పెన్నులు, బ్యాగులు అందజేసిన విద్యార్థులతో మౌనిష్ రెడ్డి

చిత్రం న్యూస్, భోరజ్:  ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం భోరజ్ మండలం కామాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, బ్యాగులను అందజేశారు. గ్రామస్తులు ఐక్యతతో ఉండాలని.. అందరూ బాగుంటేనే వ్యవస్థ బాగుంటుందని పేర్కొన్నారు. ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకెళ్తే పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.అనంతరం కామాయి గ్రామానికి చెందిన అక్షర అనే అమ్మాయికి (వికలాంగురాలికి) వీల్ ఛైర్ అందజేశారు. గ్రామస్తులు  ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రాధానోపాధ్యాయులు అశోక్, ఉపాధ్యాయులు రాజేందర్, గ్రామస్తులు రాజారెడ్డి, సాగర్ వైద్య, బెజ్జారపు రాజు, రూప్ రావు, ప్రమోద్, సతీష్ తదితరులు ఉన్నారు.

విద్యార్థుల కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు

0

వరప్రసాద రావును సన్మానిస్తున్న విద్యార్థులు

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ జూనియర్ కాలేజ్ లో విద్యార్థుల కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ తత్వవేత్త, సమాజ సేవకులు, బేల కీర్తన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా. వేముగంటి వరప్రసాద రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు .విద్యార్థుల ఆసక్తులు, నైపుణ్యాలు, విలువలకు సరిపోయే వివిధ కెరీర్ మార్గాల గురించి, విద్యార్థులు తమ కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికను ఎలా రూపొందించుకోవాలో చెప్పారు. కెరీర్ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను ఎలా అభివృద్ధి చేయాలో వివరించారు. వివిధ రంగాలలో ఉన్న ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ వేటలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన్ను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి, కాలేజీ ప్రిన్సిపల్ విజయ్ కాంబ్లే పాల్గొన్నారు.

గురువును సన్మానించిన పూర్వ విద్యార్థులు

0

గురువును సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు 

చిత్రం న్యూస్, జైనథ్:  గురు పూర్ణిమను పురస్కరించుకొని జైనథ్  మండలంలోని దీపాయిగూడ ఉన్నత పాఠశాల1997-98 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు తమకు చదువు చెప్పిన గురువు నాగభూషణం దంపతులను ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ పట్టణంలోని వారి స్వగృహానికి  వెళ్లి ఆయన్ను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జైనథ్ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, కళావతి బ్లడ్ బ్యాంక్ చైర్మన్ తలాల అశోక్, అభివాటర్ అధినేత రాకేష్ రెడ్డి, ఏం.సుభాష్, సీ హెచ్ భూమన్న, ఎ.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

గురువుని సన్మానించిన పూర్వ విద్యార్థులు

0

గురువుని సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు

చిత్రం న్యూస్ బోథ్ : గురు పౌర్ణిమ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు  సురేష్ వైద్యను పూర్వ విద్యార్థులు శాలువాతో ఘనంగా సన్మానించారు. మెర్గు భోజన్న. శ్రీనివాస్. రమేష్. ప్రసాద్, నాగభూషన్, గంగాధర్,K. రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యోగతో మానసిక ప్రశాంతత

0

యోగతో మానసిక ప్రశాంతత

చిత్రం న్యూస్, బోథ్ :యోగతో మానసిక ప్రశాంతత లభిస్తుందని యోగ శిక్షకురాలు మునిగెల యోగిత అన్నారు. ఆరోగ్య పాఠశాల రెండో విడత కార్యక్రమంలో భాగంగా బోథ్ మండల కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.  విద్యార్థులకు సూర్య నమస్కారాలు, వీరభద్రసన్, బట్టర్ ఫ్లై వంటి యోగ ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ రాథోడ్ వలిత మాట్లాడుతూ.. నిత్యజీవితంలో యోగ భాగమవ్వాలని ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో యోగాని పెట్టడం శుభపరిణామన్నారు.యోగాతో శారీరకంగానే కాక మానసికంగా కూడా దృఢంగా ఉంటారని మానసిక ప్రశాంతతతో పాటు విద్యార్థుల్లో ఏకాగ్రత, చిత్త శుద్ధి ద్యానం వల్ల పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన ఏఐసీసీ విచార్ విభాగ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ 

0

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన ఏఐసీసీ విచార్ విభాగ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్

చిత్రం న్యూస్, సొనాల: మండలంలోని సాకేర గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ళను ఏఐసీసీ విచార్ విభాగ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్  పరిశీలించారు.. ఈ సందర్భంగా తుల అరుణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లని పెద్దోడితో సమానంగా పేదోడు కూడా ఆత్మగౌరవంతో జీవించాలన్న ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేసిందని, ఇంత పెద్ద మొత్తంలో ఇళ్లను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు, మాజీ ఎంపీ సోయం బాపూ రావుకు, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల, సీనియర్ నాయకులు గాజుల పోతన్న, పీఏసీఎస్ డైరెక్టర్ పోశెట్టి, బీసీ సెల్ అధ్యక్షులు జుంగాల భోజన్న, మాజీ సర్పంచ్ వినోద్, రామ్ చందర్, కాకాజీ , హరి సింగ్, బలిరాం, సుధీర్, గంగాధర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వేదంలో గురు పూజోత్సవ వేడుకలు

0

ఘనంగా వేదంలో గురు పూజోత్సవ వేడుకలు

చిత్రం న్యూస్, బోథ్: వేదం పాఠశాలలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు కుమ్మరి పోశెట్టి, ,సురేష్ వైద్య, విచ్చేసి వారు విద్యార్థులకు గురుపూజోత్సవం విశిష్టతను తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అతిథులను పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సన్మానించారు. గురుపూజోత్సవం గురించి ఉపన్యసించారు. శిష్యునిలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులు నింపే వాడే నిజమైన గురువు అని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు అసలైన గురువన్నారు. త్రిమూర్త  సమానుడైన గురువుకు హైందవ సంస్కృతిలో పర పరమోన్నత స్థానం ఉందని, విద్యార్థులతో పాటు భాషకు జ్ఞానపిపాసి గావించి వెలుగులు ప్రసాదింపజేసి లౌకిక జ్ఞాన సంపన్నులను చేసే సద్గురువు లను ఆరాధించడమే అసలైన గురుపూజోత్సవ ఉద్దేశమని వివరించారు. విద్యార్థులు గురు యొక్క గొప్పతనం గురించి విశిష్టతను గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. గురువు గొప్పతనాన్ని చాటుతూ పద్యాలు కూడా పాడారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయండి

0

బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయండి

 *జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి 

చిత్రం న్యూస్, బోథ్ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఈ ప్రాంత ప్రజల చిరాకాల ఆకాంక్ష నెరవేర్చాలని బోథ్ నియోజకవర్గం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులతో పూర్తి వివరాలు తీసుకొని, ముఖ్యమంత్రికి తెలియజేస్తానని, రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సహకరిస్తానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, మెరుగు దాసు తదితరులు పాల్గొన్నారు.