Home Blog Page 64

ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ల ఫొటో ట్రేడ్ హైదరాబాద్ ఎక్స్పో పోస్టర్లను ఆవిష్కరించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

0

ఈఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ల ఫొటో ట్రేడ్ హైదరాబాద్ ఎక్స్పో పోస్టర్లను ఆవిష్కరించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

చిత్రం న్యూస్, నేరడిగొండ :తెలంగాణ  రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోషియేషన్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్న  ఫొటో ట్రేడ్ హైదరాబాద్ ఎక్స్పో పోస్టర్లను నేరడిగొండ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్  శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. మారుతున్న కాలాన్ని బట్టి నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫొటోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షులు దోడ అశోక్, ఉపా అధ్యక్షులు ముప్కాల ప్రవీణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాపాక విజయ్ కుమార్, జనరల్ సెక్రటరీ పెరుమాండ్ల సురేష్, కోశాధికారి వినోద్, ఉపాధ్యక్షులు జాదవ్ సంతోష్, ఫొటోగ్రాఫర్లు అన్వేష్, శేఖర్, సాయి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

భైంసా మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయింపు, ధర్నా

0

భైంసా మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయింపు, ధర్నా

*వేతనాల పెంపుదల కోసం విధుల బహిష్కరణ  

చిత్రం న్యూస్, భైంసా: కార్మిక చట్టాన్ని అనుసరిస్తూ తమకు వేతనాల పెంపుదల చేపట్టాలని డిమాండ్ చేస్తూ భైంసా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఉదయం వేళలో మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు వేతనాల పెంపుదల చేపట్టేంతవరకు విధులకు హాజరుకాబోమని వెల్లడించి కార్యాలయ ఆవరణలో బైఠాయించారు. తామందరము విధులను బహిష్కరిస్తున్నట్లుగా వెల్లడించి ప్రవేశ మార్గం వద్ద ధర్నాకు దిగారు. మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్ పారిశుద్ధ్య కార్మికులకు నచ్చచెప్పేందుకు పలు విధాలుగా యత్నించినప్పటికీ వారందరూ  ధర్నాను కొనసాగించారు. కొంతమేర గడువిస్తే ఉన్నతాధికారులకు వేతనాల పెంపు విషయం వివరించి సమస్య పరిష్కరిస్తానని మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్ తెలియజేసినప్పటికి పారిశుద్ధ్య కార్మికులు ససేమిరా అన్నారు.  వేతనాల పెంపుదలతో పాటు తమ పీఎఫ్ ఖాతాలలో సైతం డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఇతర మున్సిపాలిటీల్లోని పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే వేతనాలను తమకు కూడా అందించాలని, పీఎఫ్ ఖాతాలలో పెండింగ్ లో ఉన్న డబ్బులన్నింటినీ చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫోన్ చేయండి:మంత్రి జూపల్లి

0

ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫోన్ చేయండి:మంత్రి జూపల్లి

*ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి

*మంత్రితో పాటు పర్యటనలో పాల్గొన్న కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: కాంగ్రెస్ ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బోథ్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద స్మృతివనాన్ని ప్రారంభించారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు ట్రై కార్ యూనిట్లను పంపిణీ చేశారు. తదనంతరం ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లబ్దిదారులను అధికారులు కానీ ,ప్రజాప్రతినిధులు ఎవరైనా డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, అలా ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫోన్ చేయాలని తన నంబర్ ప్రజలకు ఇచ్చారు. అంతకుముందు ఇంద్రవెల్లి స్థూపం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.భూమి కోసం విముక్తి కోసం దోపడికి వ్యతిరేకంగా తిరగబడి అసువులు బాసిన అమరవీరుల స్మారకార్ధం ఇంద్రవెల్లిలో స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి గిరిజనుల చిరకాల స్వప్నమని, ఎట్టకేలకు ఆ కల నెరవేరిందని అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని స్మృతివనంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, . అవసరమైన నిధులను కూడా వెంటనే మంజూరు చేశారని గుర్తు చేశారు. కోటి రూపాయలతో స్మృతివనాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ స్మృతి వనం వద్ద ఏటా ఆదివాసి అమరులకు స్వేచ్ఛా వాతావరణంలో నివాళులు అర్పించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చడానికి ప్రభుత్వ, సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవని, సామాజిక రుగ్మ‌త‌ల‌ను రూపుమాపినప్పుడే న‌వ స‌మాజం నిర్మిత‌మ‌వుతుంద‌ని ఉద్భోదించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విట్టల్,ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, డిసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, టీపీసీసీ ఉ పాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క,మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి, కాంగ్రెస్ పార్టీ బోథ్ అసెంబ్లీ ఇన్చార్జ్ ఆడే గజేందర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఎస్పీ అఖిల్  మహాజన్ తదితరులు పాల్గొన్నారు.

డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫోన్ చేయండి:మంత్రి జూపల్లి

Adilabad బోథ్ రెవెన్యూ డివిజన్ డిమాండ్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు

0

Adilabad బోథ్ రెవెన్యూ డివిజన్ డిమాండ్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు మోడల్ ఇందిరమ్మ ఇల్లు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, డార్మెటరీ భవనాలను గురువారం  ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు.  స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాధవ్ బోథ్ ను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలనే ప్రస్తావన ఉంచగా అందుకు మంత్రి స్పందిస్తూ రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు శతవిధాలా ప్రయత్నిస్తాను కాని హామీ ఇవ్వనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బోథ్ నియోజకవర్గంలోని జలపాతాల విషయంలో సైతం తాను సందర్శించిన తరువాతే అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ను రెడీ చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.

బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

0

బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

చిత్రం న్యూస్, బోథ్ :ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా పీఏసీఎస్ డైరెక్టర్ చట్ల ఉమేష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌ఛార్జి, మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్, ఇతర పార్టీల నుంచి మొత్తం 124 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువ నాయకుడు, వ్యూహకర్త అలపాటి అచ్యుతానంద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ కౌసర్, షేక్ షబీర్, ఆమెర్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి  ఆడే గజేందర్  నేతృత్వంలో పార్టీ లోకి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అంకితభావంతో కృషి చేస్తుందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు.  పార్టీ విస్తరణలో ముఖ్య పాత్ర పోషిస్తున్న చట్ల ఉమేష్ కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ మల్లెపూల నర్సయ్య, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, కాంగ్రెస్ విచార్ విభాగ్ రాష్ట్ర కన్వీనర్ తుల అరుణ్, మార్కెట్ ఛైర్మన్  బొడ్డు గంగారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.

మూడు నెలలుగా ప్రభుత్వ పాఠశాల స్కావెంజర్లకు అందని వేతనాలు

0

మూడు నెలలుగా ప్రభుత్వ పాఠశాల స్కావెంజర్లకు అందని వేతనాలు

చిత్రం న్యూస్, నిర్మల్ : ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సర్వీస్ పర్సనల్ (స్కావెంజర్ ) కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాల కార్మికుల సంఘం అధ్యక్షులు కదం మారుతి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలో విద్యా కమిటీ పేరుతో విద్యా సంవత్సరం ప్రారంభంలో కమిటీ తీర్మానం ప్రకారం పాఠశాల సర్వీస్ పర్సనల్ (స్కావెంజర్ ) కార్మికులను నియమించుకుందని, అప్పటి నుండి నేటికి మూడు నెలలు గడిచిన వేతనాలు అందలేదన్నారు. విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఒకటి నుండి ముప్పై మంది విద్యార్థుల సంఖ్య ఉంటే మూడు వేలు, ముప్పై నుండి అరవై మంది విద్యార్థులు ఉంటే ఆరు వేలు, అరవై పైకి గా ఉంటే పన్నెండు  వేలు..ఎన్నో ప్రభుత్వాలు మారిన కానీ సమస్యలు మాత్రం ఇప్పటి వరకు పరిష్కారం కాలేదన్నారు. మూడు నెలలు నుండి జీతాలు లేకుండా పని చేస్తే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని అన్నారు. జిల్లా కలెక్టర్, విద్యా శాఖ అధికారులు వెంటనే స్పందించి జీవో ప్రకారం పెండింగ్ వేతనాలు ఇవ్వకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఈవో భోజన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పి.సత్తన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండూరు మల్లేష్, పాండురంగ,  పోశెట్టి, కవిత, భోజన్న, లక్ష్మి, చంద్రకాంత్, రాణి, నారాయణ, లక్ష్మి, చిన్న సాయన్న, తదితరులు పాల్గొన్నారు.

గంగాధర్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేత

0

గంగాధర్ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందజేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ 

చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా రూ.5 లక్షల చెక్కును ఎక్సైజ్, టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు,  ఖానాపూర్  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారీగా కురిసిన వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు నిండడంతో వరద నీరును దిగువ ప్రాంతానికి పంపే క్రమంలో కడెం డ్యామ్ గేట్లను ఎత్తడంతో ఆ వరద ప్రవాహానికి గంగాధర్  వరద నీటికి కొట్టుకుపోయారు. ఆచూకీ దొరకపోవడంతో ప్రభుత్వం నుండి కుటుంబ సభ్యులకు  ఆర్థిక సహాయంగా  రూ.5 లక్షలను అందజేశామని, అలాగే కుటుంబ సభ్యులలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు అందజేసి వారి కుటుంబానికి అండగా నిలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

0

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

*నేరడిగొండ మండలం కుమారి పీఏసీఎస్ (PACS) చైర్మన్ మందుల రమేష్ కాంగ్రెస్ లో చేరిక

చిత్రం న్యూస్, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నేరడిగొండ మండలం కుమారి పీఏసీఎస్ (PACS) ఛైర్మన్  మందుల రమేష్ ఎట్టకేలకు కారు దిగి చేయికి జై కొట్టాడు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంత్రి వెంట డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇందిరమ్మ మోడల్ హౌస్ ను  ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

0

ఇందిరమ్మ మోడల్ హౌస్ ను  ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా  బోథ్ మండల కేంద్రం కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను,  గురుకుల పాఠశాల భవనంలోని డార్మెటరీ నూతన భవనాన్ని జిల్లా ఇంఛార్జ్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్, ఎమ్మెల్సీ దండే విఠల్, గ్రంధాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఎస్పీ అఖిల్ మహాజన్, ట్రైనీ కలెక్టర్ సలోని ఛాబ్రా, అదనపు కలెక్టర్ శ్యామల దేవి, వివిధ శాఖల అధికారులు. ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.