Home Blog Page 61

యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు

0

యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు

చిత్రం న్యూస్, బేల: రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. అదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో సోమవారం యూరియా బస్తాలు దిగుమతి సమాచారం అందుకున్న రైతులు భారీగా తరలివచ్చారు . పలు గ్రామాల రైతులు వేకువజామునే యూరియా కోసం ఎరువుల దుకాణాల ముందు వరసలో నిలబడి కష్టాలు పడ్డారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులకు యూరియా అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయంలో యూరియాను ప్రభుత్వం అందుబాటులో ఉంచడం లేదంటూ రైతులు మండి పడుతున్నారు. వ్యవసాయ పనులు వదిలేసి మీ చుట్టూ  తిరగాలా అంటూ మండిపడుతున్నారు. సహకార సంఘానికి యూరియా వస్తున్నా అది సరిపోవడంలేదని అధికారులు పేర్కొంటున్నారు. తెల్లవారిందంటే చాలు యూరియా కోసం సింగిల్ విండో గోదాములు, ఎరువుల దుకాణాల బాట పడుతున్నారు.  రైతులు.ప్రతి రోజూ యూరియా వచ్చిందా.. అంటూ మండల కేంద్రానికి వచ్చిపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు.

గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించండి

0

గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించండి

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం భాది గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషాను కలిసి వినతిపత్రం అందజేశారు. సిర్సన్న నుంచి బాది వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను పరిష్కరించి గ్రామస్థుల కష్టాలు తీర్చాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు శివ కిరణ్, వజీర్, శ్రీనివాస్, నందు, సతీష్, రామ్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

పింఛన్ల పెంపు కోసం తహసీల్దార్ కార్యాలయం ముట్టడించిన బీడీ కార్మికులు 

0

పింఛన్ల పెంపు కోసం తహసీల్దార్ కార్యాలయం ముట్టడించిన బీడీ కార్మికులు 

చిత్రం న్యూస్, కుంటాల : నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో  బీడి కార్మికులు సోమవారం  తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. ఎన్నికల్లో హమీ ఇచ్చిన విధంగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్  చేశారు. నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ కుంటాల మండల ఇంఛార్జి కత్తి బాబు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రూ.4వేల పింఛను ఇస్తామని ప్రకటించిందన్నారు. ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. 1000 బీడీలకు రూ.800 వేతనం ఇవ్వాలన్నారు. రెండు వందల బీడీల కట్టింగ్ యాజమాన్యం నిలిపివేయాలని, పీఎఫ్ తో సంబంధం లేకుండా పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన ఆకు, తంబాకు  ఇవ్వాలని తెలిపారు. కార్మికుల పిల్లలకు రావాల్సిన ఫెండింగ్ స్కాలర్ షిప్ విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు  మానాజీ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, భోజన్న,  పింఛను బీడీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

నల్ల బ్యాడ్జిలతో నిరసన

0

         నల్ల బ్యాడ్జిలతో నిరసన

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు.  పాఠశాల ఆవరణలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఉష్కెలా కార్తీక్,  కళాశాల ప్రిన్సిపాల్ రాజా కిరణ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శరత్, అధ్యాపకులు ముకుందరావు, లింగన్న, రవి, శేఖర్, సాయికుమార్, అరవింద్ విద్యార్థులు పాల్గొన్నారు.

వీధి కుక్కల భయంతో ఇంటి పైకప్పు ఎక్కిన ఎద్దు

0

వీధి కుక్కల భయంతో ఇంటి పైకప్పు ఎక్కిన ఎద్దు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల భారీ నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ ఎద్దు ఏకంగా గ్రామానికి చెందిన కోగుర్వార్ శ్రావణ్ ఇంటి పైకప్పు పైకి ఎక్కింది. మనుషులు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికి అయినా వెనకాడం. ఈ విషయంలో మనుషులే కాదు జంతువులు కూడా దీనికి అతీతం కాదు అని నిరూపించింది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. జైనథ్ మండలం నిరాల గ్రామానికి చెందిన రైతు షేక్ గఫూర్ తన ఎద్దును ఇంటి బయట కట్టేశాడు. అదే సమయంలో కొన్ని వీధి కుక్కలు గుంపుగా వచ్చి ఆ ఎద్దుపై దాడికి ప్రయత్నించాయి. దీంతో భయపడిన ఎద్దు, ప్రాణ భయంతో కట్టు తాళ్లను తెంచుకుని పరుగులు పెట్టింది. అలా పరుగెడుతూ పక్కనే ఉన్న రాళ్ల కుప్పపైకి ఎక్కి అక్కడి నుంచి నేరుగా ఓ ఇంటి పైకప్పు మీదకు చేరి తన ప్రాణాలు కాపాడుకుంది. ఇంటిపై ఎద్దును చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. తాళ్ళ సహాయంతో చాలా సేపు శ్రమించి ఎద్దును కిందకు దించారు. పై కప్పు మీదకు ఎక్కడంతో ఇంటికి స్వల్ప నష్టం వాటిల్లింది. ఈ ఘట నను చూసిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు ఫోటోలు తీయగా… ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉత్తమ ఉపాధ్యాయుడు సాయినాథ్ కు సన్మానం

0

ఉత్తమ ఉపాధ్యాయుడు సాయినాథ్ కు సన్మానం

చిత్రం న్యూస్, భైంసా:నిర్మల్ జిల్లా ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2025 సంవత్సరానికి గాను భైంసా మండలం వానల్ పాడ్ గ్రామంలోని వైష్ణవి విద్యానికేత్ పాఠశాల కరెస్పాండెంట్ సాయినాథ్ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఆయనను పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వర్,  ఉపాధ్యాయులు,  చింతలబోరి గ్రామస్తులు అభినందించారు. అనంతరం సాయినాథ్ మాట్లాడుతూ.. ఈ అవార్డు తనపై మరింత భాద్యతను పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సుభాష్, ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ వడేకర్ లక్ష్మణ్, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్, పీఆర్టీయూ నాయకులు రమణారావు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాచేవాడ్ గంగా ప్రసాద్, లయన్స్ క్లబ్ మోహన్ రావు పటేల్, తదితరులు పాల్గొన్నారు.

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు  నష్ట పరిహారం చెల్లించాలి

0

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు  నష్ట పరిహారం చెల్లించాలి

చిత్రం న్యూస్, జైనథ్: భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని జైనథ్ మండల కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జైనథ్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..భారీ వర్షానికి వరదలతో రైతులు సోయా,పత్తి పంటలు నష్టపోయి దాదాపుగా నెల రోజుల అయిన ఇంత వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని, ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు.తక్షణమే నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సూర్య రెడ్డి, అశోక్, సిడం రాకేష్, పోచ్చన్న, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Vehicle checking_ బాసరలో విస్తృతంగా వాహనాల తనిఖీ

0

Vehicle checking_ బాసరలో విస్తృతంగా వాహనాల తనిఖీ

*హెల్మెంట్ ధరించండి ప్రాణాలు కాపాడండి_ఎస్సై బి. శ్రీనివాస్

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా  బాసర లో ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. ఎస్సై బి.శ్రీనివాస్ వాహనదారుల  ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై బి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి వాహనానికి సంబంధించిన పత్రాలు, ఇన్సూరెన్స్,  డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా ఉంచుకోవాలన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ని తప్పక ధరించాలన్నారు. ముఖ్యంగా మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వరాదని, అనుకోని ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులే బాధ్యత వహించవలసి ఉంటుందని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని,  ఎక్కువగా ప్రమాదాలు మద్యం మత్తులో జరుగుతున్నాయన్నారు. ద్విచక్ర వాహనాలపై ఇద్దరికంటే ఎక్కువ  ప్రయాణించకూడదని, ప్రతి వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పకుండా ఉండాలన్నారు. వాహనాలకు నెంబర్ ప్లేట్లేకుండా ప్రయాణించరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ గగన్,  రత్నాకాంత్, సంతోషి, సమీరా తదితరులు పాల్గొన్నారు.

 

د

ROAD, BRIDGE: రోడ్డు, వంతెన లేక పరుపులపల్లె గ్రామస్తుల కష్టాలు

0

ROAD, BRIDGE: రోడ్డు, వంతెన లేక పరుపులపల్లె గ్రామస్తుల కష్టాలు

*ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వంతెన దాటుతున్న  విద్యార్థులు, గ్రామస్తు

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా  సొనాల మండలంలోని పరుపులపల్లె గ్రామంలో వర్షాకాలం వస్తే ప్రజల కష్టాలు అంతా ఇంతా కావు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊరికి రోడ్డు,  వంతెన లేకపోవడంతో ఇబ్బందులు నడుమ వాగు దాటుతూ వెళ్లాల్సివస్తోంది.  ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి తలెత్తుతుంది. వర్షాల సమయంలో  విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి ఆ వాగును దాటి పాఠశాలకు వెళ్ళాల్సి వస్తోంది. రహదారి లేకపోవదంతో వాహన రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోతున్నాయి. మా పిల్లలు చదువు కోసం అవస్థలు పడాల్సి వస్తోందని, శాశ్వత రోడ్డు, వంతెన లేకపోతే ఈ ఇబ్బందులు ఎప్పటికీ తగ్గవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదురవుతోందని, కనీసం విద్యార్థుల భవిష్యత్తు కోసం అయినా వెంటనే రోడ్డు, వంతెన నిర్మించాలని పరుపులపల్లె గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

తెలుగు భజన కళాకారుల సంఘం సభ్యత్వ నమోదు

0

తెలుగు భజన కళాకారుల సంఘం సభ్యత్వ నమోదు

చిత్రం న్యూస్, తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామంలో తెలుగు భజన కళాకారుల సంఘం యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భజన కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పలు విషయాలు చర్చించారు. తెలుగు భజన కళాకారుల సంఘం అభివృద్ది, సంఘం భవనం, సభ్యత్వ నమోదు మొదలయిన పలు అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు భజన కళాకారుల సంఘం అధ్యక్షుడు గడుగు గంగన్న, ప్రధాన కార్యదర్శి తోట నగేష్, రాకేష్ యాదవ్, కొడిమెల దేవరెడ్డి పలువురు భజన కళాకారులు పాల్గొన్నారు.