Home Blog Page 118

ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలి

ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలి

*సైదాపూర్ మండల ఆటో కార్మికుల ఆవేదన

చిత్రం న్యూస్, సైదాపూర్:

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో సైదాపూర్ మండల ఆటో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఆటో కార్మికులకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని అమలు చేయలేకపోయిందని కార్మికులు ఆరోపించారు. ఈ వైఫల్యం వల్ల ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతిని, ఆర్థిక ఇబ్బందులతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడినట్లు వారు ఆవేదన వెలిబుచ్చారు. స్థానిక ఆటో కార్మికులైన పొడిశెట్టి నరేష్, పిల్లి నరేష్, గడ్డం శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఉచిత బస్సు పథకం వంటి విధానాలతో తమ ఉపాధిని కోల్పోయేలా చేసిందని, హామీ ఇచ్చిన ఆర్థిక సాయం అందకపోవడంతో తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని వాపోయారు. మా బతుకులు గాడినపడాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి, హామీ ఇచ్చిన రూ.12,000 సాయాన్ని అందించాలి. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి అని వారు డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల హామీలను నెరవేర్చి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ఆటో కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

ఘనంగా కడప మహానాడు

ఘనంగా కడప మహానాడు
*టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు
*మహానాడులో పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప


చిత్రం న్యూస్, పెద్దాపురం:
కడపలో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహానాడు మొదటిరోజు సీఎం చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ప్రజా ప్రతినిధుల నమోదు, ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. మా తెలుగు తల్లి గీతాలాపన అనంతరం మరణించిన పార్టీ కార్యకర్తలకు, నేతలకు ప్రజాప్రతినిధులతో కలిసి సంతాపం ప్రకటించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగాపెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్పతో కలిసితిలకించారు.

సామర్లకోటలో యోగా శిక్షణా తరగతులు ప్రారంభం

సామర్లకోటలో యోగా శిక్షణా తరగతులు ప్రారంభం

*యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్
*మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో యోగా శిక్షణా తరగతులు ప్రారంభించిన ఎంపీడీఓ హిమ మహేశ్వరి[ez-toc]

చిత్రం న్యూస్, సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో యోగా శిక్షణా తరగతులను ఎంపీడీవో హిమామహేశ్వరి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21 వ తారీఖున 11వ అంతర్జాతీయ యోగాంధ్ర నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సామర్లకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో యోగా ట్రైనర్స్ చేత వివిధ రకాల యోగాసనాల సాధన చేయించారు. ఎంపీడీఓ హిమ మహేశ్వరిమాట్లాడుతూ.. ఈ నెల 31 వ తారీకు వరకు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మండల కార్యాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

సైదాపూర్‌లో మాజీ సర్పంచ్‌ల ముందస్తు అరెస్ట్

సైదాపూర్‌లో మాజీ సర్పంచ్‌ల ముందస్తు అరెస్ట్ 


*పెండింగ్  బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్

చిత్రం న్యూస్, సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాంచంద్రాపూర్, దుద్దెనపల్లి, చింతలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లు రేగుల సుమలత అశోక్, మేకల శిరీష ముకుంద రెడ్డి, యుగంధర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించకుండా, మాజీ సర్పంచ్‌లను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం గ్రామపంచాయతీలకు సంబంధించి 153 కోట్ల 10 లక్షల రూపాయల విలువైన 9,990 బిల్లులు, అలాగే 85 కోట్ల రూపాయల ఎస్‌డీఎఫ్ గ్రాంట్ చెల్లించినట్లు పత్రికల ద్వారా ప్రకటించింది. అయితే, ఈ బిల్లులు కేవలం పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన చిన్న చిన్న పనులకు మాత్రమే చెల్లించారు. మాజీ సర్పంచ్‌లు చేసిన పనులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము గతంలో గ్రామాల్లో రోడ్లు, హైమాస్ట్ లైట్లు, గ్రామపంచాయతీ భవనాలు, మురుగు కాలువలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాము. ఈ అభివృద్ధి సేవలను ప్రజలు ఇప్పటికీ వినియోగిస్తున్నారు. అయినా మా బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు? అసలు బిల్లులు చెల్లిస్తారా? చెల్లించరా? అనే గందరగోళంలో మాజీ సర్పంచ్‌లు మానసిక ఆందోళనకు గురవుతున్నాం,” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెద్ద కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు కమిషన్లతో సహా చెల్లిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, గ్రామస్థాయిలో ప్రజల కోసం చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. మాజీ సర్పంచ్‌లు చేసిన పనులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, మా పనులను గుర్తించి, పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ డిమాండ్ చేశారు.

సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం

సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం

*కేటీఆర్ సేన పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్

చిత్రం న్యూస్, ఓదెల:

సిరిసిల్లలో మాజీ మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని కేటీఆర్ సేన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మ్యాడగోని శ్రీకాంత్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామంలో శ్రీకాంత్ గౌడ్ మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసు, మిస్ వరల్డ్ అవమాన ఘటన ప్రజల దృష్టిని మళ్లించడానికేనని ఆరోపించారు. సిరిసిల్లలో ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం

కాంగ్రెస్ వాదులు దాడిచేయడానికి యత్నించగా నాయకులు ధైర్యంగా అడ్డుకున్నారని, ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాపాలన అని చెప్పుకుని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న నాయకులపై దాడులకు దిగడం సిగ్గుచేటని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని నిరంతరం నిలదీస్తామన్నారు.

తోషంలో కుటుంబ సమ్మేళనం

లోకమాత అహల్యాబాయి హోల్కర్ త్రి శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా తోషంలో కుటుంబ సమ్మేళనం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషంలో  సామాజిక సమసరత వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో కుటుంబ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సమరసత వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి రావుత్ రవీందర్ తెలిపారు.  లోకమాత అహల్యాబాయి హోల్కర్ త్రి శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా మే 30న సాయంత్రం 6 గంటలకు తోషం లో కుటుంబ సమ్మేళనం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ హాజరవుతున్నారాన్నారు. సభ్యులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.

యోగాపై శిక్షణా కార్యక్రమాలు

యోగాపై శిక్షణా కార్యక్రమాలు

చిత్రం న్యూస్, సామర్లకోట: 

సామర్లకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయిలో యోగ శిక్షణా కార్యక్రమము ఏర్పాటు చేయడమైనదని ఎంపీడీఓ హిమ మహేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించుచున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాపై శిక్షణ ఇచ్చుటకుగాను గ్రామ స్థాయి సిబ్బందికి మే నెల 27 నుండి 31 వరకు ఉదయం 07.00 గం.ల నుండి 09.00 గంటల వరకు శిక్షణ ఇవ్వడానికి గ్రామ స్థాయి సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలను మంగళవారం నుంచి మొదలుపెడు తున్నట్లు హిమ మహేశ్వరి తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని కోరారు.

విశాఖపట్నంలో యోగాపై శిక్షణా కార్యక్రమాలు

చిత్రం న్యూస్, సామర్లకోట: సామర్లకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయిలో యోగ శిక్షణా కార్యక్రమము ఏర్పాటు చేయడమైన్దదని ఎంపీడీఓ హిమ మహేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు.  విశాఖపట్నంలో నిర్వహించుచున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాపై శిక్షణ ఇచ్చుటకుగాను గ్రామ స్థాయి సిబ్బందికి మే నెల 27 నుండి 31 వరకు ఉదయం 07.00 గం.ల నుండి 09.00 గంటల వరకు శిక్షణ ఇవ్వడానికి గ్రామ స్థాయి సిబ్బందికి  మంగళవారం నుంచి మొదలు పెడుతునట్లు హిమ మహేశ్వరి తెలిపారు. ఈ అవకాశాన్ని  వినియోగించుకోవాలని కోరారు.

ఈనెల 28న జీలకుంట లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు 

ఈనెల 28న జీలకుంట లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు 

*మండల వ్యవసాయ అధికారి భాస్కర్

చిత్రం న్యూస్, ఓదెల: ఈ నెల 28న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లోనీ జీలకుంట గ్రామం లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ కార్యక్రమం లో కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుండి శాస్త్రవేత్తలు రానున్నారని,  రైతులకు వ్యవసాయం సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం బుధవారం రోజు ఉదయం 8.00 గం కి జీలకుంట గ్రామ పంచాయతీ దగ్గర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఓదెల మండల రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సాగులో సమస్యల పరిష్కారం , నూతన వ్యవసాయ పద్ధతులు విత్తనాల గురించి తెలుసుకోవాలన్నారు.

ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులను చేర్పించాలి

ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులను చేర్పించాలి

*బొమ్మనపల్లి ప్రధానోపాధ్యాయులు పి. లక్ష్మణరావు


చిత్రం న్యూస్, చిగురుమామిడి:
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి జిల్లా పరిషత్తు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.లక్ష్మణరావు కోరారు. సోమవారం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, అంగన్ వాడి టీచర్స్,ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల నమోదు సంఖ్య పెంచడం గురించి కార్యాచరణ రూపొందించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విక్రమ్ కిరణ్ కుమార్, హై స్కూల్ ఉపాధ్యాయులు బాల్ రెడ్డి, సత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.