Home Blog Page 106

సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల గ్రామంలోని రామాలయంలో హిందూ ధర్మ జాగరణ మండలి  ఆధ్వర్యంలో డిసెంబర్ 2023 శనివారం రోజున ప్రారంభించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగుతోంది. ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు సభ్యులతోపాటు భక్తులు, విద్యార్థులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొంటున్నారు. నేటికీ 83 వారాలను పూర్తి చేసుకున్నట్లు సభ్యులు తెలిపారు. హనుమాన్ చాలీసా పారాయణం వలన భక్తిశ్రద్ధలు, ఏకాగ్రత, ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, మంచి భావాలు, ధైర్యం ,తేజస్సు మొదలైన గుణాలు పెంపొందుతాయని సభ్యులు పేర్కొన్నారు. ప్రతి వారం భగవద్గీత శ్లోకాల పఠనం కూడ చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు. వంద వారాల పాటు 2025 నవంబర్ వరకు సామూహిక హనుమన్ చాలీసా పారాయణం కొనసాగుతుందని తెలిపారు.

✖ Close హోం

బేల తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత

బేల తహసీల్దార్ రఘునాథ్ రావ్ కు వినతిపత్రం అందజేస్తున్న ఆదివాసీ సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ నందకుమార్

చిత్రం న్యూస్, బేల: జీవో నెంబర్ 49 ను రద్దు చేయాలని కోరుతూ బేల మండల కేంద్రంలోని  తహసీల్దార్ కార్యాలయంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ నందకుమార్ కమిటీ సభ్యులతో కలిసి తహసీల్దార్ రఘునాథ్ రావ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ నందకుమార్ మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ పేరుతో ప్రభుత్వాలు తీసుకొచ్చినా జీవో నంబర్‌ 49 ద్వారా ఆదివాసీ గ్రామాలు కనుమరుగవు తాయని అడవిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలకు తీవ్రఅన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

✖ Close హోం

మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయం

బేడ బుడగ సంఘం కాలనీలో ఉచిత కళ్ళద్దాలు పంపిణీ కార్యక్రమంలో బోథ్ ఎస్ఐ శ్రీ సాయి

చిత్రం న్యూస్, బోథ్:  ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయమని బోథ్ ఎస్సై శ్రీ సాయి అన్నారు.  శనివారం సాయినగర్ లోని బుడగ సంఘం కాలనీలో నిర్వహించిన ఉచిత కళ్ళద్దాలు పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సేవలో తమ ఆలోచన తో ముందుకు పోతున్నారన్నారు.  ప్రజలకు ఏమి అవసరమో  ఆలోచిస్తూ.. వైద్య శిబిరంలో  భాగంగా కళ్ళద్దాలు, కంటి ఆపరేషన్ లు ఇలా ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తున్నారన్నారు. మాసం అనిల్ కుమార్ మాట్లాడుతూ ..ఇప్పటి వరకు సొసైటీ తరుపున 100 మందికి కంటి ఆపరేషన్లు, 300 అద్దాలు వరకు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. భవిషత్యు లో మెగా హెల్త్ క్యాంప్, ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో బేడ బుడగ సంఘం అధ్యక్షుడు ఇర్నల రమేష్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు మెరుగు భోజన్న, కొట్టాల పోచమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు కొట్టాల రమేష్ రెడ్డి ,యూత్ సభ్యులు రమేష్, సంతోష్, ఉమేష్, విఠల్, కాలనీవాసులు పాల్గొన్నారు.

✖ Close హోం

కాంగ్రెస్ నేత ఏలేటి అశ్విన్ రెడ్డి ఉదారత

రిషికకు రూ.3.45 లక్షల విలువ గల వినికిడి యంత్రాన్ని అందజేస్తున్న కాంగ్రెస్ నేత ఏలేటి అశ్విన్ రెడ్డి ఉదారత

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన నవ్వ రిషిక కి కాంగ్రెస్ జిల్లా నేత ఏలేటి అశ్విన్ రెడ్డి రూ.3.45 లక్షల వినికిడి యంత్రాన్ని అందజేసి ఉదారత చాటారు. వినికిడి యంత్రం కావాలని గత కొన్ని రోజుల క్రితం అశ్విన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రిషిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని స్పందించి తప్పకుండ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. శనివారం రూ.3.45 లక్షల విలువైన వినికిడి యంత్రాన్ని నవ్వ రిషికకు అందచేశారు. అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తు లో రిషిక ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగం సాధించాలని, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రిషిక తండ్రి రాజు మాట్లాడుతూ.. నా కూతురికి వినికిడి యంత్రం వచ్చేలా కృషి చేసినందుకు అశ్విన్, అనీష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.   ఈ సందర్భంగా అశ్విన్ రెడ్డిని శాలువాతో సన్మానించారు . ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుడాల అనీష్,  నాయకులు ప్రవీణ్, మహేష్, రామ్ లక్ష్మణ్ గౌడ్, భాశెట్టి శివ, సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

వేదంలో ఘనంగా బోనాల జాతర

వేదంలో ఘనంగా బోనాల జాతర

చిత్రం న్యూస్, బోథ్: మండల కేంద్రంలోని వేదం పాఠశాలలో ఘనంగా బోనాల జాతర నిర్వహించారు. ఈ బోనాల జాతరలో అమ్మవారిని అలంకరించిన తీరు అందరిని ఆకర్షించింది. ఇంతే కాకుండా పిల్లలు ధరించిన అమ్మవారి, పోతురాజుల వేషధారణలు  ఆకట్టుకున్నాయి.  పాఠశాల ప్రధానోపాధ్యాయులు పచ్చిపాల సంతోష్. బోనాల జాతర మన సాంప్రదాయ పండగని అది ఆషాడమాసంలోనే ఎందుకు జరుపుకుంటామనే  విషయం గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు అమ్మవారి గీతాలను ఆలపించి వాటిపై నృత్యాలను చేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని  అలరించాయి. ముఖ్యంగా విద్యార్థిని చేసిన అమ్మవారి పూనకం వచ్చినట్టు, భవిష్యవాణి చెప్పినట్టుగా చేసిన నాటకం అందరిని చాలా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

✖ Close హోం

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి 

*కస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థులతో వివరాలు అడిగి తెలుసుకుంటున్న మండల ప్రత్యేక అధికారి మనోహర్

*జూనోని గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన 

చిత్రం న్యూస్, బేల: ప్రజలందరూ తమ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేక అధికారి మనోహర్ ప్రజలకు సూచించారు. శుక్రవారం బేల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంతో పాటు మండలం లోని జునోని గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ డ్రై డే, ప్రై డే కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మనోహర్ మాట్లాడుతూ…వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అలాగే కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాని సూచించారు.  గ్రామాల్లో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో మహేందర్ కుమార్, బేల పంచాయతీ సెక్రటరీ వేణు గోపాల్, అధికారులు తదితరులు ఉన్నారు.

✖ Close హోం

విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

చిత్రం న్యూస్, ఇచ్చోడ: విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఇచ్చోడ వీడిసి అధ్యక్షుడు నారాయణ, ప్రధాన కార్యదర్శి సురేష్ లు అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వీడీసీ సభ్యులతో కలిసి సందర్శించారు. కళాశాలను ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించడం చాలా అభినందనీయమన్నారు. కళాశాల వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ఉన్న మౌలిక వసతులను పరిశీలించి, విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇతర అవసరమైన వసతుల గురించి ఆరో తీశారు.  వీడీసీ కమిటీ సలహా సభ్యులు అబ్దుల్ గఫార్, ఆశన్న, నరేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

మిస్సింగ్, చోరీ అయిన మొబైల్ ఫోన్లు రికవరి

మిస్సింగ్, చోరీ అయిన మొబైల్ ఫోన్లు రికవరి

*బాధితులకు అందజేసిన పోలీసులు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ లలో మొబైల్ మిస్సింగ్, చోరికి గురియిన దాదాపు 150 పైగా ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. బాధితులకు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వాటిని పోలీసులు అందచేశారు. పోయినవని అనుకున్న ఫోన్లు మళ్ళీ తిరిగి రావడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. జీవితంలో ఫోన్ ఒక భాగం అయిపోయింది.  ఎటు వెళ్ళాలన్న ఏం చేయాలన్న చేతిలో ఫోన్ ఉండాల్సింది. ప్రతిదీ ఫోన్ లోనే భద్రపర్చుకుంతున్నారు. మొబైల్ పడిపోతే లేదా ఎవరైనా దొంగలిస్తే ఆందోళన చెందాల్సిన పరిస్థితి. అయితే టెన్షన్ పడకుండా వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి సీఈఐఆర్ పోర్టర్ లో ఫిర్యాదు చేస్తే చాలు మీ ఫోన్ ఎక్కడున్నా పోలీసులు వెతికిపట్టుకుంటారు.

✖ Close హోం

కల్తీ కల్లు మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని వినతి

ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీకి వినతిపత్రం అందజేస్తున్న సామాజి కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కల్తీ కల్లు మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో కల్తీ కల్లు విక్రయిస్తున్న కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కల్తీ కల్లు తాగి ఎంతోమంది అనారోగ్య బారినపడటమే కాక.. రహదారి ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని వివరించారు. కల్తీ కల్లు కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. సురేందర్ రెడ్డి, ప్రసాద్ చారి, శ్రీకాంత్ రెడ్డి, అతర్వ తదితరులు ఉన్నారు.

✖ Close హోం

బోథ్ కేజీబీవీలో సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్స్

బోథ్ కేజీబీవీలో సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్స్

చిత్రం న్యూస్, బోథ్:  ఆదిలాబాద్ జిల్లా బోథ్ కస్తూర్బా గాంధీ కళాశాల  ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపీసీ గ్రూపు లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రత్యేక అధికారిణి రాథోడ్ వలిత తెలిపారు. అడ్మిషన్స్ తీసుకునే అభ్యర్థులు ఈ నెల 22 న మంగళవారం తమ ఒరిజినల్ సర్టిఫికేట్ తో కేజీబీవీ లో హాజరుకావాలని కోరారు.

✖ Close హోం