Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 105

13 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ 

0

13 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

*నేరడిగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

*పేకాట ముక్కలు, రూ 14,080/- నగదు, ఆరు బైకులు, 13 మొబైల్ ఫోన్స్ స్వాధీనం

*నేరడిగొండ నీలిమా దాబా వెనకాల స్థలంలో పట్టుబడ్డ 13 మంది

చిత్రం న్యూస్, నేరడిగొండ: జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు విశ్వసనీయ సమాచారంతో నేరడిగొండ మండలం నీలిమ ధాబా వెనకాల పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఇచ్చోడ సిఐ బండారి రాజు, నేరడిగొండ ఎస్సై దాడి చేయగా సంఘటన స్థలంలో 13 మంది నేరస్తులు పట్టుబడ్డారని ఇచ్చోడా సీఐ బండారి రాజు తెలిపారు. వీరి వద్దనుండి పేకాట ముక్కలు రూ 14,080 నగదు, ఆరు బైక్లు, 13 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. పట్టుబడిన  వారిలో సయ్యద్ జహీర్, గడ్డం రవిచందర్ రెడ్డి, గూడూరు లవ కుమార్, రాథోడ్ రవీందర్, అల్లూరి శివారెడ్డి, ఉప్పు పోశెట్టి, సోలంకి శ్రీనివాస్, నల్ల అడెల్లు, సోలంకి కరన్ సింగ్, గోతి గులాబ్ సింగ్, మాడ గంగాధర్, అల్లూరి శ్రీనివాస్ రెడ్డి, పవర్ సంతోష్ లు ఉన్నట్లు వీరందరూ నేరడిగొండ దగ్గరలో ఉన్న గ్రామాలకు చెందిన వారని తెలిపారు. ఈ ఆపరేషన్ నందు ఇచ్చోడ సిఐ బండారి రాజు, నేరడిగొండ ఎస్ ఐ శ్రీకాంత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Odelah: 32 రైల్వే గేట్ నుండి రోడ్డు పనులు ప్రారంభం

0

*తారక రామ  కాలనీ వాసుల ఆకాంక్ష  ఈ రోడ్డు 

చిత్రం న్యూస్, ఓదెలః
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో 32 రైల్వే గేట్ నుండి డీ 86 కెనాల్ బ్రిడ్జి వరకు రూ. 7 లక్షల వ్యయంతో కాంగ్రెస్ నాయకులు రోడ్డు పనులను బుధ‌వారం జేసీబీ సాయంతో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ఓదెల మండల ఆఫీస్ వరకు రెండు వరుసల రోడ్డు మంజూరు కాగా అనివార్య కారణాల వలన తారకరామ కాలనీ నుండి రోడ్డు పనులు నిలిచిపోగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు చొరవతో 32 రైల్వే గేట్ తారకరామ కాలనీ నుండి డీ 86 కెనాల్ బ్రిడ్జి వరకు రోడ్డు పనులు పూర్తి చేయనున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తాజా మాజీ ఎంపిటిసి బోడకుంట లక్ష్మీ చిన్నస్వామి, చీకట్ల మొండయ్య, మీనుగు సంతోష్, గొర్ల శ్రీనివాస్, రాపల్లి రాజయ్య, అల్లం సతీష్, డాక్టర్ వెంకటేశ్వర్లు, క్యాతం తదితరులు ఉన్నారు

జగదాంబ దేవి ఆలయాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

0

జగదాంబ దేవి ఆలయాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

చిత్రం న్యూస్, బోథ్;

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బుగ్గారం గ్రామంలో గల శ్రీ జగదాంబ దేవి అలాయాన్ని బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ దర్శించుకొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ను ఘనంగా సన్మానించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకులు రాథోడ్ సురేందర్, నాని (నక్లు), పాండు, ప్రతాప్ తదితరులు ఉన్నారు.

ఘనంగా సామ రూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలు……*

0
  • ఉప్పొంగిన అభిమానం…

*మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన….*

75 మంది స్వచ్ఛంద రక్తదానం…

చిత్రం న్యూస్, ఆదిలాబాద్;

యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం బేల మండల కేంద్ర ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.స్థానిక A N ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన శిబిరానికి మండలంలోని అభిమానులు పార్టీ కార్యకర్తలు యువకులు ఉప్పెనెల తరలివచ్చి రక్తదానం చేశారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 75 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ ఆడే గజేందర్,కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క,కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ హాజరై కేక్ కట్ చేసి సామ రూపేష్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని పరిశీలించి రూపేష్ రెడ్డిని అభినందించారు. పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ యువతరం నాయకుడు,ప్రజల మనసులు గెలుచుకున్న జన హృదయ నేత యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులుసామ రూపేష్ రెడ్డికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  అనుక్షణం ప్రజల కష్ట సుఖల్లో ఉంటూ పేదలకు అత్యవసర సమయంలో ఒక అంబులెన్స్ ల పని చేస్తూ మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తున్నందుకు మండల ప్రజలు అభినందనలు తెలిపారు. బేల మండలంలో గిరిజనులకు ఆరోగ్య పరంగా మరిన్ని సేవలు చేయాలనీ కోరారు. భవిష్యత్తులో మీ నాయకత్వంలో బేల మండలం కాంగ్రెస్ పార్టీ మంరింత అభివృద్ధి చెందాలని కోరుతూ మీకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.

పాల్గొన్న కాంగ్రెస్ నేతలు….

ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్,మాజీ జెడ్పిటిసి రాందాస్ నాక్లె,జైనథ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వంకడే,బేల మాజీ ఎంపీపీ బాపురావు హుల్కే,మాజీ ఎంపిటిసి లు సుదర్శన్,నగేష్ రెడ్డి,శంకర్,కిసాన్ కాంగ్రెస్ బేల మండల అధ్యక్షుడు గాన్ శ్యామ్,యువజన కాంగ్రెస్ బేల మండల అధ్యక్షుడు అవినాష్,జైనథ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మడవి చంద్రకాంత్,శంకర్,అఖిల్,వినోద్,మేకల జితేందర్,అభిమానులు పాల్గొన్నారు.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్;
కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో భోరజ్ మండలంలోని సిరసన్న గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి కే వీ కే సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్, శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంటలలో ఎరువుల సమతా స్థితి, విచక్షణారహితంగా పురుగుమందులు వాడకుండా చూడడం, పంట మార్పిడి, నీటి సంరక్షణ పద్ధతులు, విత్తనము విత్తన రకాలు ,విత్తన రసీదు, చెట్లు నాటడం, పర్యావరణం కాపాడడం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ సిద్ధార్థ, మండల ఉద్యానవన అధికారి, అలేఖ్య, ఏ ఈ వో తౌసిఫ్ పాల్గొన్నారు.

రైతుల ఆత్మహత్యలు బాధాకరం.. జోగు రామన్న.

0

రైతుల ఆత్మహత్యలు బాధాకరం.. జోగు రామన్న.

చిత్రం న్యూస్,  సాత్నాల;

రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోవడం బాధాకరమని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా ఆత్మ స్థైర్యంతో ఉండాలని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. సాత్నాల మండలం సుందరిగి గ్రామానికి చెందిన కొప్పుల లచ్చన్న అనే రైతు ఇటివల ఆత్మహత్య చేసుకోగా…. బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి పరామర్శించారు. అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురై రైతు ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కుటుంబ సభ్యులను కలిసి అధైర్య పడవద్దు అని ధైర్యాన్ని కల్పించారు.. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు సైతం అందకపోవడం రైతుని తీవ్రంగా కల్చవేసిందన్నారు.దిక్కుతోచని స్థితిలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.. రైతులు ఆత్మ స్థైర్యంతో ఉండాలని, అన్నం పెట్టె అన్నదాత ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడవడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు కుటుంబాలలో తీవ్ర సంక్షోభం ఏర్పడే రైతు ఆత్మస్త్రాన్ని దెబ్బతీస్తుంది అన్నారు.. రైతులు ఎవరు అధైర్య పడకుండా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపిటిసి దేవన్న, సర్పంచ్ నర్సింగ్, పోచ్చన్న, కిష్టన్న, సంతోష్, పోతన్న, మునఫ్, కుమ్రా రాజు, ఉగ్గే విట్టల్ తదితరులు ఉన్నారు…

ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం* 

0
  1. *ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం                                                                                                                      చిత్రం న్యూస్ , ఆదిలాబాద్;  జైనథ్ మండల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా విద్యాధికారి ఏ. శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉమ్మడి జైనథ్ PSHM మరియు SGT ఉపాధ్యాయుల కు 5 రోజుల వరకు వృత్యంతర శిక్షణ కార్యక్రమంలిటిల్ ఫ్లవర్ స్కూల్ శాంతినగర్ లో నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమం గురించి కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. విద్యా విధానంలో సమూల మార్పులు చేయడానికి రాష్ట్ర విద్యాశాఖ సిద్ధంగా ఉంద ని ,విద్యార్థులు లకు నూతన విధానం లో బోధన జరిగేలా చూడాలని అందుకే పాఠశాల ప్రారంభంకు ముందే ఉపాధ్యాయులకు శిక్షణను ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ శిక్షణ లో ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొనలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గంగుల శ్రీనివాస్, జిల్లా సెక్టోరియల్ అధికారులు J నారాయణ, సుజాత్ ఖాన్, DEO CC రాజేశ్వర్, మండల రిసోర్స్ పర్సన్లు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు, mrc సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్ రాజర్షి షా
[ez-toc]

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

హనుమంతుడి సింధూర పూజ కథ*

0

హనుమంతుడి సింధూర కథ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:
హనుమంతుడి ఆలయాల్లో స్వామికి సింధూరాన్ని అలంకరించడం, భక్తులు దాన్నే బొట్టుగా పెట్టుకోవడం చూస్తుంటాం. మారుతికి సింధూరాన్ని అర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయనే నమ్మకమూ ఉంది. సూటిగా చెప్పాలంటే ఒక్క హనుమాన్ ఆలయాల్లోనే కాషాయ రంగు సింధూరం కనిపిస్తుంది. అసలు, స్వామికి కుంకుమ బదులు సింధూరాన్ని అర్పించడం వెనుక చిన్న కథే ఉంది. హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోకవనానికి చేరుకున్నప్పుడు… వెంటనే సీతమ్మ దగ్గరకు వెళ్లలేదట. కాసేపు అమ్మవారిని గమనించాడట. ఆ సమయంలో ఆమె పాపిటలోని సింధూరాన్ని చూశాడట. ఆ తర్వాత సీతాదేవి చెంతకు వెళ్లినప్పుడు సింధూర ధారణకు కారణాన్ని అడిగి తెలుసుకున్నాడట. అప్పుడు సీతాదేవి… శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టమనీ, స్వామి దీర్ఘాయుష్షు కోసం తాను ధరిస్తున్నాననీ వివరించిందట. కాస్త సింధూ రాన్ని ధరించినందుకే దీర్ఘాయుష్షు వస్తే, తాను కనుక శరీరమంతా లేపనంలా రాసుకుంటే రాముడికి ఎలాంటి సమస్య ఉండదని భావించాడట హనుమంతుడు. అదే సమయంలో స్వామి ప్రేమను ఇంకాస్త ఎక్కువగా పొందవచ్చనే ఉద్దేశంతోనూ తన ఒళ్లంతా సింధూరాన్ని రాసుకోవడం మొదలుపెట్టాడట. ఇదీ, సీతాశోక నివారకుడి సింధూర పూజ కథ.

రెడ్డి హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

0

 

 

*చిత్రం న్యూస్, ఆదిలాబాద్,* ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం 3:30 గంటలకు రెడ్డి హాస్టల్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం మొదలవుతుందని రెడ్డి సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నల్ల నారాయణ్ రెడ్డి, గోపిడి రాంరెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాల నుండి రెడ్డి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

 

బొమ్మనపల్లిలో అగ్నిప్రమాదం

0

చిత్రం న్యూస్, చిగురుమామిడి,
కరీంనగర్ జిల్లా చిరుగుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ముత్యాల కొమురయ్య తండ్రి బక్కయ్య ( 42) అనే రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద సోమవారం అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైతు కొమురయ్య పశువుల పాక ముందు వెళ్తున్న 11కే వీ విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తాకడంతో మంటలు చెలరేగి పక్కనే ఉన్న పశువులపాక అంటుకొని, 1200 గడ్డి కట్టలు దగ్ధమయ్యాయని తెలిపాడు. ఈ ప్రమాదంలో ఆవు తీవ్రంగా గాయపడింది. డ్రిప్ వైర్లు ,టార్ఫాలిన్ కవర్లు పూర్తిగా కాలిపోయాయి. పశువులపాక కూడా కాలిపోయింది. రైతు కొమరయ్య అగ్నిమాపక  సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పారు. ఈ ప్రమాదంలో 5.0లక్షల వరకు నష్టపోయానని రైతు వాపోయాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వేడుకున్నాడు.