Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 100

ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేత జగన్

0

ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేత జగన్

*మీడియా సమావేశంలో మాజీ మంత్రి, ఎంఎల్ఏ నిమ్మకాయల చిన రాజప్ప

చిత్రం న్యూస్, పెద్దాపురం:

ప్రజలకు వెన్నుపోటు పొడవటం జగన్ కుటుంబానికి వాళ్ళ తాతల కాలం నుంచి అలవాటని అలాంటి కుటుంబం నుండి వచ్చిన జగన్ వెన్నుపోటు అంటూ ప్రజల ముందుకు రావడం హాస్యాస్పదమని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ.. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేత జగన్ రెడ్డని. జగన్ తన సొంత కుటుంబాన్నే వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు. లిక్కర్ తదితర కేసుల్లో వైసీపీ నేతలు వరుసగా జైలుకు వెళ్లడంతో జగన్ కు వెన్నులో వణుకు పుడుతోందని, జగన్ ఓటమి తర్వాత తన అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు వెన్నుపోటు అంటూ ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు డీఎస్సీ ప్రకటించి, దీపం పధకం అమలు చేశారని, రోడ్లకు మహర్దశ తీసుకొని వచ్చారని రాజప్ప అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజప్ప తెలిపారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల అందజేత

0

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల అందజేత

* క్యాంప్ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేసిన ఎంఎల్ఏ నిమ్మకాయల చినరాజప్ప

చిత్రం న్యూస్, పెద్దాపురం:

పెద్దాపురం పట్టణం లో ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. పెద్దాపురం పట్టణం క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబురాజు చేతుల మీదగా రామారావుపేట కు చెందిన రొంగల ఆనంద్ కు వెన్నెముక శస్త్ర చికిత్స నిమ్మిత్తం రూ. 67,038/-,రోడ్డు ప్రమాదం లో గాయపడిన పాత పెద్దాపురంకి చెందిన బొగ్గు వీరబాబు కి 81,965/- అందజేశారు. ఈ కార్యక్రమం లో తెలుగుయువత రాష్ట్ర కార్య


దర్శి మహ్మద్ అరీఫ్ అలీ, రంధి సత్యనారాయణ పాల్గొన్నారు.

అరుణాచల గిరి ప్రదక్షణ యాత్రకు ప్రత్యేక బస్ సౌకర్యం

0

అరుణాచల గిరి ప్రదక్షణ యాత్రకు ప్రత్యేక బస్ సౌకర్యం

*హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్

చిత్రం న్యూస్, హుజురాబాద్:

అరుణాచల గిరి ప్రదక్షణ యాత్రకు ఈ నెల 9న హుజురాబాద్ ఆర్టీసీ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం ఉందని ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9న మధ్యాహ్నం 2 గంటలకు హుజురాబాద్ బస్ స్టేషన్ నుంచి బస్ బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం, మరుసటి రోజు 10వ తేదీన రాత్రి వరకు అరుణాచలం చేరుకుని, 11వ తేదీన అరుణాచల గిరి ప్రదక్షణ అనంతరము తిరిగి సాయంత్రం 4 గంటలకు ఆరుణాచలంలో బయలుదేరి 12వ తేదిన హుజురాబాద్ కి బస్ చేరుకుంటుందని తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సుకు చార్జి పెద్దలకు రూ.4,500, పిల్లలకు రూ.3,800గా నిర్ణయించబడిందన్నారు. అడ్వాన్స్ బుకింగ్ కొరకు ఈక్రింది ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు. 9959225924, 9704833971, 9247159535, 9441404841 కి ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కుడా ఉన్నదని, ఇట్టి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎం సూచించారు.

ఘనంగా మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు

0

ఘనంగా మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్, హుజురాబాద్:

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన వేడుకలను మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  నాయకుల నడుమ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.  మాజీ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్,  బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్న చైర్మన్లు, వార్డ్ అధ్యక్షులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

0

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

*ఖరీఫ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి

*మండల వ్యవసాయ అధికారి రాజుల నాయుడు

చిత్రం న్యూస్, చిగురుమామిడి:
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల వ్యవసాయ అధికారి రాజుల నాయుడు హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్ కి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచామని తెలిపారు. నకిలీ విత్తనాలను గుర్తించడానికి మండల వ్యాప్తంగా అన్ని ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీ చేసినట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మండల వ్యాప్తంగా 24,600 ఎకరాలు వరి, మొక్కజొన్న 400 ఎకరాలు, 1500 ఎకరాలు పత్తి సాగు చేస్తున్నట్లు తెలిపారు.యూరియా, డిఏపి, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు విత్తనం రకం, కంపెనీ, రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చునని తెలిపారు. రైతులకు ఎలాంటి  సందేహాలు ఉన్న తమను సంప్రదించాలని సూచించారు.

ఉన్నతాధికారుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం దృష్టి

0

ఉన్నతాధికారుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం దృష్టి

చిత్రం న్యూస్ సామర్లకోట:

ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఏడాదిపాలన పూర్తి కానుండటంతో భారీగా బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తుంది. 10 జిల్లాలకు పైగా కలెక్టర్లు, 8 జిల్లాలకు పైగా ఎస్పీలు బదిలీ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఉన్నతాధికారుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎల్లుండి ఏపీ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా విద్యార్థుల తల్లిదండ్రులపై నమ్మకాన్ని పెంపొందించాలి

0

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా విద్యార్థుల తల్లిదండ్రులపై నమ్మకాన్ని పెంపొందించాలి

*మండల విద్యాధికారి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి

చిత్రం న్యూస్, సైదాపూర్:

ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశగా విద్యార్థుల తల్లిదండ్రులపై నమ్మకం తీసుకురావాలని మండల విద్యాధికారి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం విద్య వనరుల కేంద్రంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆయన ముఖ్య సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచేలా ప్రతి గ్రామంలో ఈనెల 6 నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేటు పాఠశాలలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను విద్యార్థుల తల్లిదండ్రులకు అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ కట్ట రవీంద్రచారి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఆర్.ప్రభాకర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, ఎల్. సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు, ఏం.ఐ.ఎస్.కో ఆర్డినేటర్, సీఆర్పీలు పాల్గొన్నారు.

సైదాపూర్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు *అమరుల త్యాగాలు మరువలేనివి

0

సైదాపూర్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

*అమరుల త్యాగాలు మరువలేనివి

చిత్రం న్యూస్, సైదాపూర్:

సైదాపూర్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ, మహిళా సమాఖ్య, వ్యవసాయ, పాక్స్ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అమరవీరులను స్మరించుకుంటూ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలు మరువలేనివన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో భూక్యా యాదగిరి, వ్యవసాయ అధికారి వైదేహి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుండారపు శ్రీనివాస్, పాక్స్ ఛైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, ఏపీఎం చెన్నబోయిన కుమారస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్, వివిధ గ్రామశాఖ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో  తెలంగాణ  రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు

0

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు

చిత్రం న్యూస్,హుజురాబాద్: ‌ 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్  ఎగరవేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మక్కపల్లి కుమార్ స్వామి, బీఆర్ఎస్ వార్డు అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతున్న పేదవాడి సొంతింటి కల

0

ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతున్న పేదవాడి సొంతింటి కల

*హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు

చిత్రం న్యూస్ శంకపట్నం:
శంకరపట్నం మండలంని ముత్తారం గ్రామంలో భూమి పూజ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పదేళ్ల నిరీక్షణ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పేదలకు పంచుతుంటే వారి నుండి అనూహ్య స్పందన వస్తుందని,పేదవారి సొంతింటి కల కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైందని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తున్నామనన్నారు. ముత్తారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం శంకరపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాగోని బస్వయ్య గౌడ్ కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. లబ్దిదారులకు పట్టాలు ఇస్తున్న క్రమంలో వారు కొంత భావోద్వేగానికి లోనయ్యారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ మండలంలో ఒక్క ఇంటిని కూడా ఇవ్వలేదని,గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు మాత్రమే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని,మళ్ళీ పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకునే నాయకులు నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విడతల వారిగా అర్హుడైన ప్రతి లబ్దిదారులకు పథకాలు అందజేస్తామని, రేషన్ కార్డులు,ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఉచిత బస్ రవాణా సౌకర్యం లాంటి సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు యువకులు పాల్గొన్నారు.