చిత్రం న్యూస్,భోరజ్: పిప్పర్వాడ గ్రామంలోని అభ్యుదయ హైస్కూల్‌లో 10వ తరగతి విద్యార్థుల కోసం “తల్లిదండ్రుల ఆత్మీయ ఆశీర్వచన కార్యక్రమం” అత్యంత వేడుకగా జరిగింది. విద్యార్థులు తమ జీవితంలో కీలకమైన పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు పాఠశాల యాజమాన్యం ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ’ అని అంటూ సాగిన ఈ వేడుక అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.

