చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కూర గ్రామంలో శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి పంతొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భజన పోటీలు నిర్వహిస్తున్నారు. 24-01-2026 శనివారం రాత్రి 8:00 గంటల నుండి పోటీలు ప్రారంభం కానున్నాయి. ప్రథమ బహుమతి రూ.11 వేలు, రెండోబహుమతి రూ.5 వేలు, మూడో బహుమతి రూ.3 వేలు, ఉత్తమ గాయకుడు రూ.వేయి, ఉత్తమ వాద్య సంగీతానికి రూ.వేయి నగదు అందజేయనున్నారు. ప్రతి భజన మండలిలో ఏడుగురు సభ్యులు ఉండాలని,భక్తి గీతాలు, తత్వగీతాలు పాడవచ్చని (చూసి పాడకూడదు) పేర్కొన్నారు. ప్రదర్శించే బృందమునకు 30 నిమిషములు సమయం ఉంటుందన్నారు.భజన మండలి వారు 5 పాటలు పాడాలని (సమయ పాలన పాటించాలి), ఈ 5 పాటలలో శ్రీ వేంకటేశ్వరుని గురించి ఒక భక్తి గీతం పాడాలని తెలిపారు.భజన సామాగ్రి (హార్మోనియం, తబలా, తాలాలు) ఎవరివి వారే తెచ్చుకోవాలన్నారు. తుది నిర్ణయంన్యాయ నిర్ణేతలదేనని, భజన కళాకారులకు భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు.పాల్గొనేవారు ఫోన్ నంబర్లు 9441015240, 9441239091 కి సంప్రదించాలని సూచించారు.

