చిత్రం న్యూస్,బేల: బేల మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి ఇటీవల రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. శుక్రవారం ఆ పాఠశాలలో ఆరోగ్య జాతర ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ పాఠశాలకు విరాళాలు అందజేసిన దాతలను జిల్లా కలెక్టర్ సన్మానించగా సామ రూపేష్ రెడ్డి చేసిన ఉదారతను గుర్తించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేకంగా ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.

