చిత్రం న్యూస్ బేల: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజనుల (గోండులు) ముఖ్యమైన సాంప్రదాయ పూజలలో కుల దేవత పెర్సపెన్‌ను పూజిస్తారు. పంటలు పండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని, క్షేమం కోసం పూజలు చేస్తారు, ఇవి పుష్యమాసం, మే నెలల్లో జరుగుతాయి, సంస్కృతి, సంప్రదాయాలు, కొత్త కోడళ్ళను పరిచయం చేసే వేడుకలతో ఘనంగా జరుగుతాయి. పూజలో భాగంగా ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. సంస్కృతి, సంప్రదాయాలను పాటించి, ఊరేగింపులు నిర్వహిస్తారు. పెర్సపెన్ అంటే పెద్ద దేవుడు లేదా బడా దేవ్, ఈయన ఆదివాసుల సర్వోన్నత దేవుడు. గోండు, కోలాం ఆదివాసీ గిరిజన తెగలు ఈ పూజలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలం బాధి, వడగూడ గ్రామాల్లో పుష్య మాసం సందర్భంగా జుగ్నక పరివార్ వంశీయులు, మంగళవారం పెర్సపేన్ పూజలు ప్రారంభించారు. మూడు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్రలో ఎక్కడినుంచో వచ్చిన బంధుమిత్రులు పెర్సపేన్ కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్న ఈ పూజలో కుటుంబ సభ్యులతో పాటు జగ్నక గాంధీ కటొడ్ల, జుగ్నక శంబు, జుగ్నక నందు, సిడాం నందు కుమార్, జుగ్నక లక్ష్మణ్, జుగ్నక శంకర్ తదితరులు పాల్గొన్నారు.

