*కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
చిత్రం న్యూస్, కొత్తపేట: ఆలమూరు మండలంలో పలు రహదారుల మరమ్మతులకు రూ.1.10 కోట్ల ఆర్ అండ్ బీ నిధులు మంజూరు అయ్యాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు .జొన్నాడ నుంచి మండపేట ప్రధాన రహదారికి సంబంధించి కొత్తూరు సెంటర్ నుంచి గుమ్మిలేరు వరకూ మరమ్మతుల నిమిత్తం రూ.80 లక్షలు, చింతలూరు నుంచి సూర్యారావుపేట వరకూ రహదారి మరమ్మతుల కొరకు రూ.30లక్షలు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలుపెడతామని ఆయన పేర్కొన్నారు.

