చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పాఠన్ లో వారం రోజుల కొనసాగుతున్న సంత్ బాజీరావు మహారాజ్ సప్తాహ వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో ముగిశాయి.. చివరి రోజు పల్లకీతో ఊరేగింపు నిర్వహించగా ఇంటింటా భక్తులు పూజలు నిర్వహించారు. మాజీమంత్రి జోగు రామన్న హాజరై మహారాజ్ చిత్రపటానికి పూజలు నిర్వహించారు.. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మనోహర్, భారాస నాయకులు గంభీర్ ఠాక్రే, ప్రమోద్ రెడ్డి, సతీష్ పవార్, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

