చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం ఓని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల కోసం పూర్వ విద్యార్ధి కదం యోగేష్ పాఠశాలకు canon colour printer ను విరాళంగా అందజేసి ఉదారత చాటుకున్నాడు. ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్, టీచర్ మౌనిక చేతుల మీదుగా అందజేశాడు. సుమారు వీటి విలువ రూ.6,500 వరకు ఉంటుందని అన్నారు. ఇక్కడే ప్రభుత్వ పాఠశాలలో 20 సంవత్సరాల క్రితం చదివి ఇదే పాఠశాలకు తనకు తోచిన కాడికి ఆర్థిక సాయం అందించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందని యోగేష్ అన్నారు. గ్రామస్తులు పాల్గొన్నారు.

