చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారత హాకీకి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక్ ప్రవీణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత హాకీ సమాఖ్య (IHF)కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) గుర్తింపు లభించి 7 నవంబర్ 2025తో వందేళ్ల మైలురాయిని చేరిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులు ఇతర క్రీడలతో పాటు హాకీలోను రాణించి జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. క్రీడలతో శారీరక ధారుడ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందన్నారు. హాకీలో గెలిచిన క్రీడాకారులకు లోక ప్రవీణ్ రెడ్డి ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థ సారథి, కోచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

