చిత్రం న్యూస్, హైదరాబాద్: కోకాపేట్‌లోని శ్లోక ది గ్లోబల్ స్కూల్ లో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్రమైన లక్ష దీపోత్సవ వేడుకను ఆధ్యాత్మికతతో, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్లోక చైర్మన్, అధ్యక్షుడు పి.జైపాల్ రెడ్డి, ప్రత్యేక అతిథులుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంజనాదేవి, అకడమిక్ డైరెక్టర్ బాలాజీ, శ్లోక పాఠశాల మెంబర్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు.
పాఠశాల ఆవరణలో వెలిగిన అనేక దీపాలతో ఆ ప్రాంగణమంతా దివ్య కాంతితో మెరుస్తూ, ప్రశాంత వాతావరణాన్ని సృష్టించింది. అనేకమంది తల్లిదండ్రులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐక్యత, సానుకూలతకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుకలో భాగమయ్యారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దీపికా ఠాకూర్ మాట్లాడుతూ. మా విద్యార్థుల తల్లిదండ్రులే కాక సమాజం నుండి వచ్చిన వారు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం మా హృదయాన్ని తాకిందన్నారు. మనం అందరం కలిసి ఈ సాయంత్రాన్ని ఒక దివ్యమైన, చిరస్మరణీయమైన అనుభూతిగా మార్చుకున్నాం అన్నారు. తల్లిదండ్రులు, అతిథులు, సిబ్బంది అందరికీ స్కూల్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రార్థనలతో, చిరునవ్వులతో,ఐక్యత వెలుగులతో ముగియగా..పాఠశాల యొక్క సాంస్కృతిక, ఆధ్యాత్మిక వికాస యాత్రలో మరో అందమైన మైలురాయిగా నిలిచింది.

