చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని ఐ హాస్పిటల్ సమీపలోని భైంసా–బాసర రహదారిపై గురువారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఏఎస్ఐ రవూఫ్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను ఆపి పత్రాలు పరిశీలించారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను నిలిపి వివరాలు సేకరించారు. రహదారిపై క్రమశిక్షణ పాటించేలా డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల భద్రత, చట్టం–శాంతి పరిరక్షణలో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. తనిఖీల సమయంలో లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ వంటి పత్రాలు వాహనదారులు తమ వద్ద ఉంచుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. ప్రజలు చట్టపరమైన నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీసులు సూచించారు.

