చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొదటి మూడు, ఐదవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడం కోసం ఈ నెల 22 వరకు గడువు ఉంది. కానీ ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న ప్రత్యేక వాతావరణం, వర్షాలు, ఆదివాసీ విద్యార్థులు అధికంగా ఉన్న బేల, బజార్ హత్నూర్, ఉట్నూర్ లాంటి మండలాల్లో దీపావళి సందర్భంగా గుస్సాడీ దండారీలు అనే ప్రత్యేక పరిస్థితి ఉండటంతో అధిక శాతం మంది విద్యార్థులు ఇంకా ఫీజు చెల్లించలేక పోతున్నారు. అలాగే సాంకేతిక కారణాలు కూడా ఉండటంతో యూనివర్సిటీ అధికారులు మానవత దృక్పథంతో మరో వారం రోజులు పరీక్ష ఫీజు గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పెంచాలని ఏడీసీఏ ( ఆదిలాబాద్ డిగ్రీ కాలేజీ అసోసియేషన్) తరుపున డా. వేముగంటి వరప్రసాద రావు సమావేశంలో యూనివర్సిటీ అధికారులని కోరారు.

