*పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పోలీసుల త్యాగం స్పూర్తిదాయకమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో సోమవారం పోలీసు అమరవీరుల స్థూపానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి పాల్గొన్నారు. అమర వీరుల స్తూపం వద్ద జ్యోతి వెలిగించారు. పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.

