ట్రాక్టర్ రోటవేటర్లో పడి ఒకరికి తీవ్ర గాయాలు
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలంలోని టాక్లి గ్రామానికి చెందిన శివ అనే రైతు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోటవేటర్లో పడి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ఎప్పటిలాగే తన వ్యవసాయంలో ట్రాక్టర్ రోటవేటర్ తో పనులు చేస్తుండగా అందులో కాలు ఇరుక్కుంది. స్థానికులు గమనించి శివను బయటకు తీయగా అప్పటికే రోటవేటర్లో కాలు ఇరుక్కుని తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

