అజయ్ సింగ్ ను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: కర్ణాటక రాష్ట్రం జేవర్గి ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ సీఎం కుమారుడు, ఆదిలాబాద్ డీసీసీ అబ్సర్వర్ అజయ్ సింగ్ ను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం పరిశీలనకు వచ్చిన ఆయనతో చర్చించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి, మాజీ కౌన్సిలర్స్ రాంకుమార్, ఇమ్రాన్, భూమన్న, నాయకులు శ్రీకాంత్, భూపేందర్ తదితరులు ఉన్నారు.

