పంట అమ్మకానికి వచ్చిన పూర్తికాని ఆన్లైన్
చిత్రం న్యూస్,నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుమారి గ్రామపంచాయతీలో గల కుప్టి కుమారి, గాజిలి, గాంధారి,ముల్కల్పాడు,రాయపూర్ శివారులో గల పంటలు ఇంకా ఆన్లైన్ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతమున్న ఏఈఓ రాథోడ్ వినోద్ ప్రమోషన్ పై వెళ్లడంతో పంటలను ఆన్లైన్ చేయడంలో ఆలస్యమైంది. ప్రస్తుతము కొందరి రైతుల పంటలను ఆన్లైన్ చేసినప్పటికీ ఇంకా 50% రైతుల పంటలను ఆన్లైన్ చేయవలసి ఉంది. ఇప్పటికే రైతులు అకాల వర్షాలతో నష్టాల్లో ఉండడంతో రైతుల వద్ద డబ్బులు లేక కొందరు రైతులు సోయా పంటను ప్రవేట్ మార్కెట్లో రూ.4,300 అమ్ముకుంటున్నారు. ప్రస్తుత వ్యవసాయ మార్కెట్ రేటు రూ.5,328 ఉండగా రైతులు నష్టపోకుండా పంటలను ఆన్లైన్ చేస్తే వ్యవసాయ మార్కెట్లో అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులను కోరుతున్నారు. దీపావళికి సోయాబీన్, పత్తి పంట వ్యవసాయ మార్కెట్ లో త్వరలోనే కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే. నేరడిగొండ ఏవో కృష్ణవేణి అధికారికి గ్రామ ప్రజలు ఈ సమస్యను తెలపడంతో ఏవో కృష్ణవేణి మాట్లాడుతూ.. మూడు రోజుల్లో ఏ ఈ ఓ ని నియమించి పంటలను ఆన్లైన్ చేస్తామని రైతులు ఎవరు కూడా ప్రైవేట్ మార్కెట్ కి వెళ్లి నష్టపోవద్దని త్వరలోనే వ్యవసాయ మార్కెట్లో పంటలను అమ్ముకోవాలని తెలిపారు.

