బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పవిత్రమైన పుణ్యక్షేత్రం అమ్మవారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తుల సందడి కనిపించింది . ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. అమ్మవారిని దర్శనానికి గంటల తరబడి సమయం పట్టింది. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అమ్మవారి పాదాల వద్ద ప్రత్యేక అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నారు .ఆలయ ఈఓ అంజనీదేవి, ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించారు.

