బాసర యువకులు భళా..
గోదావరి ఘాట్లు శుభ్రపరుస్తున్న గ్రామ యువకులు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి పుష్కర ఘాట్లను గ్రామ యువకులు శుభ్రపరిచారు. ఇటీవల దేవీ నవరాత్రులలో నిమజ్జనం చేసిన దుర్గ మాత విగ్రహాలు, పూలమాలలు, ప్లాస్టిక్ కవర్లు, బట్టలు పేరుకుపోయాయి. వచ్చే భక్తులు స్నానాలకు వెళ్లాలన్న భయంకరంగా ఉండేది. గమనించిన గ్రామ యువకులు స్పందించి ముందుకు వచ్చి స్వయంగా పుష్కర ఘాట్లను పరిశుభ్రం చేశారు. గ్రామ యువకులు స్వచ్ఛందంగా ఘాట్లను శుభ్రం చేయడంతో పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

